Sweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Sweat: ఎండాకాలం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా నగరాల్లో ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌ను దాటడం వల్ల సాధారణ ప్రజల పరిస్థితి ఇబ్బందిగా మారింది.

Update: 2022-05-21 11:00 GMT

Sweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Sweat: ఎండాకాలం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా నగరాల్లో ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌ను దాటడం వల్ల సాధారణ ప్రజల పరిస్థితి ఇబ్బందిగా మారింది. వేడి గాలులు వల్ల శరీరం నుంచి చెమటలు రావడం సాధారణం. కానీ కొంతమందికి విపరీతమైన చెమటలు వస్తాయి. ఇది శరీర దుర్వాసన, చుట్టుపక్కల వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే వీటి నుంచి దూరంగా ఉండవచ్చు.

1. సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి

ఫ్యాషన్ యుగంలో ట్రెండీగా కనిపించాలంటే వేసవిలో బిగుతుగా, ముదురు రంగులో ఉండే దుస్తులను ధరిస్తుంటారు. దీని కారణంగా శరీరంలోని చాలా భాగాలకు గాలి తగలదు. విపరీతమైన చెమటలు పడుతాయి. ఈ పరిస్థితిలో మీరు వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం ముఖ్యం.

2. కొవ్వు పదార్థాలు తినవద్దు

వేసవిలో ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు తినడం వల్ల అధిక చెమట పట్టడం జరుగుతుంది. దీని కారణంగా వాసన రావడం ప్రారంభమవుతుంది.

3. టెన్షన్ ఫ్రీగా ఉండండి

మండే వేడి వల్ల టెన్షన్ పడడం సర్వసాధారణం. కానీ ఒత్తిడి వల్ల విపరీతమైన చెమట పడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి వీలైనంత వరకు మైండ్ రిలాక్స్ అయ్యి చల్లగా ఉండేందుకు ప్రయత్నించండి.

4. రాత్రిపూట ఈ పని చేయండి

వేసవిలో తలస్నానం చేసి పడుకునే ముందు అండర్ ఆర్మ్స్ ఆరబెట్టి డియోడరెంట్ రాసుకుంటే చెమట తగ్గుతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Tags:    

Similar News