Dry Mouth: తరచుగా నోరు పొడిబారుతుందా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Dry Mouth: నోటిలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ మందగించినప్పుడు గొంతు పొడిగా మారుతుంది.

Update: 2022-10-01 10:00 GMT

Dry Mouth: తరచుగా నోరు పొడిబారుతుందా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Dry Mouth: నోటిలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ మందగించినప్పుడు గొంతు పొడిగా మారుతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఎక్కువగా నీటిలో తక్కువ మొత్తంలో ఫ్లోరైడ్ ఉన్నప్పుడు లేదా శరీరంలో నీరు లేకపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి సమయంలో డీ హైడ్రేషన్‌కి గురవుతారు. అందువల్ల నోరు పొడిబారినప్పుడు చికిత్స అవసరం. ఇందుకోసం కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. సోంపు నీరు

నోరు ఎండిపోయినప్పుడు సోంపు నీళ్లు తాగితే ఉపశమనం ఉంటుంది. ఇందుకోసం 1 గ్లాసు నీరు తీసుకొని అందులో టీస్పూన్ సోంపు, టీస్పూన్ పంచదార వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి తాగాలి. ఇలా చేయడం వల్ల నోరు పొడిబారడం అనే సమస్య తొలగిపోతుంది.

2. నిమ్మ, తేనె

నోరు పొడిబారడం సమస్య తగ్గాలంటే నిమ్మరసం, తేనె తీసుకోవడం ఉత్తమం. దీని కోసం గ్లాసు నీటిని కొద్దిగా వేడి చేయండి. అందులో కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలపాలి. తర్వాత ఈ నీటిని తాగాలి. ఇది నోటిలో లాలాజలాన్ని సృష్టిస్తుంది. ఇది పొడి నోరు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. అలోవెరా జెల్

నోరు పొడిబారడం అనే సమస్యను కలబందతో అధిగమించవచ్చు. దీని కోసం ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 టీస్పూన్ల కలబంద జెల్ తీసుకోవాలి. ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

4. ఏలకులు నమలాలి

నోరు పొడిబారడం సమస్య మరీ ఎక్కువవుతుంటే ఏలకులు నమలాలి. ఏలకులు తీసుకోవడం ద్వారా నోరు పొడిబారడం సమస్యను అధిగమించవచ్చు.

Tags:    

Similar News