Sleep: ప్రతిరోజు 8 గంటలు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Sleep: ప్రతిరోజు 8 గంటలు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Update: 2022-06-14 14:30 GMT

Sleep: ప్రతిరోజు 8 గంటలు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Sleep: మనం రోజు మొత్తం కోల్పోయిన నిద్రని తిరిగి తీసుకురావడమే నిద్ర ఉద్దేశ్యం. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు 7 నుంచి 8 గంటల నిద్రపోవడం చాలా అవసరం. కానీ నేటి కాలంలో చాలామంది పని ఒత్తిడి వల్ల తక్కువ గంటలు నిద్రపోతున్నారు. కొత్త కొత్త వ్యాధులని కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర సరిగ్గా లేకుంటే జరిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.

నేటి హడావిడి జీవితం, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఆ తర్వాత ఆఫీసులో అలసిపోయినట్లు కనిపిస్తారు. వరుసగా చాలా రోజులు తక్కువ నిద్రపోవడం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అది ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకే తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా కొంతమంది సరిగ్గా నిద్రపోరు. ఆల్కహాల్, గంజాయి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది శరీరంలోని అనేక భాగాలకు తీవ్రమైన హానిని కలిగిస్తుంది. అయినా కొంతమంది ఈ అలవాటును వదిలివేయరు. మత్తు వల్ల నిద్ర బాగా వస్తుందని కొందరు అనుకుంటారు కానీ కొన్ని రోజులకి దీనివల్ల మీకు నిద్ర సరిగ్గా పట్టదు. అందువల్ల మంచి నిద్ర కోసం మద్యం, గంజాయిని ఎప్పుడూ ఉపయోగించవద్దు.

Tags:    

Similar News