Health Tips: రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఇబ్బందిపెడుతుందా.. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..!

Health Tips: కొంతమందికి రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఏర్పడి చాలా ఇబ్బందిపెడుతుంది.

Update: 2022-12-05 14:45 GMT

Health Tips: రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఇబ్బందిపెడుతుందా.. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..!

Health Tips: కొంతమందికి రాత్రిపూట కడుపులో గ్యాస్‌ ఏర్పడి చాలా ఇబ్బందిపెడుతుంది. ఆ అర్ధరాత్రి ఎక్కడి వెళ్లాలో ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అలాంటి సమయంలో ఈ చిట్కాని ట్రై చేయండి. వెంటనే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేంటో తెలుసుకుందాం.

మీరు రాత్రి సమయంలో అజీర్ణం లేదా గ్యాస్ తో ఇబ్బంది పడుతుంటే ఎడమ వైపునకు తిరిగి పడుకోవాలి. దీనివల్ల చిన్నపేగులో పేరుకుపోయిన వ్యర్థాలను పెద్దపేగులోకి పంపడం సులువవుతుంది. దీంతో ఎసిడిటీ ఏర్పడదు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిద్రపోవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారాన్ని జీర్ణం చేసే పైత్యరసం ఆహార పైపు ద్వారా పైకి రాదు.

దీనివల్ల గుండెల్లో మంట, వాంతులు అనే సమస్య ఉండదు. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. దీంతో పాటు పుల్లని త్రేనుపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గ్యాస్ ఎసిడిటీ బారిన పడకూడదనుకుంటే డిన్నర్‌లో వేయించిన లేదా మసాలా పదార్థాలను తినడం మానుకోండి. ఇలాంటివి త్వరగా జీర్ణం కావు. రాత్రంతా గ్యాస్-ఎసిడిటీ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది గుండెల్లో మంట, వాంతులు-విరేచనాలకు కారణమవుతుంది.

Tags:    

Similar News