Health Tips: ఉడికించిన, పచ్చి బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. ఆరోగ్యానికి హాని..!

Health Tips: బంగాళదుంప కర్నీ చాలా రుచికరంగా ఉంటుంది. శాకాహారులు దీనిని బాగా ఇష్టపడుతారు. వీటితో అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు.

Update: 2023-11-28 07:01 GMT

Health Tips: ఉడికించిన, పచ్చి బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. ఆరోగ్యానికి హాని..!

Health Tips: బంగాళదుంప కర్నీ చాలా రుచికరంగా ఉంటుంది. శాకాహారులు దీనిని బాగా ఇష్టపడుతారు. వీటితో అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. ఇంటి వంటగదిలో ఇవి కచ్చితంగా ఉంటాయి. చిరుతిళ్ల నుంచి కూరల వరకు అన్నింటిలోనూ ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉడికించిన బంగాళాదుంపలను ప్రిజ్‌లో పెట్టకూడదు. ఇందులో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. బంగాళదుంపలను ఉడకబెట్టి, వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి మరుసటి రోజు ఉపయోగించే వారు చాలా మంది ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఇలాంటి బంగాళాదుంపలను వేయించినట్లయితే ఈ బంగాళాదుంప అమైనో ఆమ్లాలుగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

పచ్చి బంగాళదుంపలను కూడా ఫ్రిజ్‌లో పెట్టవద్దు

ముడి బంగాళాదుంపలను కూడా రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బంగాళదుంపలు త్వరగా పాడవుతాయి. వీటిలో ఉండే చక్కెర బంగాళాదుంపలో ఉండే అమినో యాసిడ్ ఆస్పరాజైన్‌తో కలిసి యాక్రిలామైడ్ రసాయనాన్ని ఏర్పరుస్తుంది. పేపర్, ప్లాస్టిక్ తయారీలో ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందువల్ల బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచే అలవాటు మానుకోండి.

బంగాళాదుంపలను ఎలా స్టోర్‌ చేయాలి

బంగాళాదుంపలను నిల్వ చేయడానికి ఒక మార్గం ఉంది. ముందుగా వాటిని సూర్యకాంతి నుంచి కాపాడాలి. ఒకదానిపై ఒకటి ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల కింద ఉంచిన బంగాళదుంపలు పాడైపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలను కనీసం 50 F అంటే 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమంగా చెబుతారు.

Tags:    

Similar News