Diabetes: షుగర్‌ పేషెంట్లు ఈ కూరగాయలని కచ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

Diabetes: షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా అవసరం. ఇందుకోసం చాలా ఆహార జాగ్రత్తలు పాటించాలి.

Update: 2022-06-16 15:30 GMT

Diabetes: షుగర్‌ పేషెంట్లు ఈ కూరగాయలని కచ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

Diabetes: షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా అవసరం. ఇందుకోసం చాలా ఆహార జాగ్రత్తలు పాటించాలి. అధిక ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరని నియంత్రించవచ్చు. అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం.

బ్రోకలీ

బ్రోకలీని సాధారణంగా చాలా మంది ఇష్టపడరు . కానీ ఇది డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ తప్పనిసరిగా బ్రకోలీని తీసుకోవాలి. మీరు బ్రోకలీని ఉడకబెట్టి సలాడ్ లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా ఆకు కూరతో కలిపి కూరగా చేసుకొని తినవచ్చు.

దోసకాయ 

దోసకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్‌ అని చెప్పవచ్చు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

బచ్చలికూర

మధుమేహంతో బాధపడేవారికి మరొక గొప్ప ఆకుకూర బచ్చలికూర. ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండటమే కాకుండా అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు పాలకూరలో బీటా కెరోటిన్, విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News