డెంగ్యూ వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందా..! వెంటనే ఈ నాలుగు ఆహారాలు తినండి..

Platelets Count: దేశంలో ఇప్పుడు కరోనా కంటే వేగంగా డెంగ్యూ విస్తరిస్తోంది.

Update: 2021-11-12 16:45 GMT

డెంగ్యు వస్తే తీసుకోవలసిన ఆహార పదార్థాలు (ఫైల్ ఇమేజ్)

Platelets Count: దేశంలో ఇప్పుడు కరోనా కంటే వేగంగా డెంగ్యూ విస్తరిస్తోంది. ఈడిస్ జాతికి చెందిన ఆడ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. రోజు రోజుకు డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగ్యూ వల్ల రోగి రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. అలాంటప్పుడు జ్వరం, వికారం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి మొదలైన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి సకాలంలో చికిత్స పొందకపోతే పరిస్థితి ప్రమాదంగా మారుతుంది.

సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో 1.5 లక్షల నుంచి నాలుగు లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ప్లేట్‌లెట్స్ 50 వేల లోపు పడిపోయాయంటే అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని హోమ్‌ రెమిడిస్‌ బాగా ఉపయోగపడుతాయి. వెంటనే ప్లేట్‌లెట్స్ స్థాయి మెరుగవుతుంది. అలాంటి శక్తివంతమైన ఆహారాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. బొప్పాయి ఆకుల రసం

బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. డెంగ్యూ వ్యాధికి బొప్పాయి ఆకుల రసం ఉత్తమ ఔషధమని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. రోజూ 10 నుంచి 20 మి.లీ జ్యూస్‌ తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగి త్వరగా కోలుకుంటారు.

2. కొబ్బరి నీరు

డెంగ్యూ సమయంలో రోగి చాలాసార్లు వాంతులు చేసుకుంటాడు. ఆ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కానీ శరీరంలో రక్తాన్ని తయారు చేయడానికి చాలా నీరు అవసరం. డెంగ్యూ సమయంలో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. నీటి కొరత తొలగిపోతుంది దీని కారణంగా ప్లేట్‌లెట్ల రికవరీ వేగంగా జరుగుతుంది.

3. కివి ఫ్రూట్‌

విటమిన్-సి, విటమిన్-ఈ, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్న కివీ పండు డెంగ్యూ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రోజూ ఉదయం, సాయంత్రం తినడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

4. మేక పాలు

డెంగ్యూ సమయంలో మేక పాలు తాగడం వల్ల కూడా త్వరగా కోలుకుంటారు. మేక పాలు తేలికగా జీర్ణమవుతాయి. ఇది రోగుల ప్లేట్‌లెట్ కౌంట్‌ను వేగంగా పెంచేలా పనిచేస్తుంది.

Tags:    

Similar News