Dates And Ghee: నెయ్యితో ఖర్జూరాలు కలిపి తింటే ఎన్ని ఉపయోగాలో.. అవేంటో మీరూ చూసేయండి..

నెయ్యి, ఖర్జూరాలు ఈ రెండింటిని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అలాగే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

Update: 2025-03-08 09:13 GMT

నెయ్యితో ఖర్జూరాలు కలిపి తింటే ఎన్ని ఉపయోగాలో.. అవేంటో మీరూ చూసేయండి..

Dates And Ghee: నెయ్యి, ఖర్జూరాలు ఈ రెండింటిని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అలాగే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ వీటిని ఎలా తినాలో తెలుసుకుందాం.

ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పిల్లలు సైతం వీటిని ఇష్టపడుతుంటారు. వీటిలో ఉండే సహజ చక్కెర వల్ల వీటిని స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతేకాదు పలు రకాల డ్రింక్స్ కూడా తయారు చేసి తాగుతుంటారు. అయితే వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ పండ్లను రోజూ మూడు చొప్పున తీసుకుని నెయ్యిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. ఖర్జూరాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల పలు వ్యాధులు నయమవడమే కాదు.. పోషణ కూడా లభిస్తుందని చెబుతున్నారు.

ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. నీరసం దరి చేరదు. ఉదయం నిద్ర లేవగానే నీరసంగా ఉంటుందని భావించేవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేసుకోవచ్చు. అంతేకాదు ఖర్జూరాలలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు హార్మోన్లను నియంత్రిస్తాయి. హర్మోన్ సమస్యలు ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. నెయ్యిలో ఉండే కొవ్వులు హర్మోన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల హర్మోన్ల సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడొచ్చు.

ఖర్జూరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తీసుకుంటే రక్తం తయారవుతుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయని.. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా తయారవుతుందని చెబుతున్నారు. ముఖం పై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోయి. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వీటిని నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు.

ఖర్జూరాల్లో అనేక విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ శరీరానికి పోషకాలు అందేలా చూస్తుంది. నెయ్యితో కలిపి వీటిని తినడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరానికి సరిగ్గా అందేలా చేస్తోంది. దీని వల్ల పోషకాహార లోపం నుంచి కూడా బయటపడొచ్చు. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. నెయ్యి, ఖర్జూరాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. నెయ్యితో కలిపి ఖర్జూరాలను తింటే బీపీ నియంత్రణలోకి వచ్చి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

Tags:    

Similar News