Curd Benefits: జుట్టుకి పెరుగు అప్లై చేస్తున్నారా.. ఇవి గమనించండి..!

Curd Benefits: జుట్టుని అందంగా మార్చుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.

Update: 2022-05-09 15:00 GMT

Curd Benefits: జుట్టుకి పెరుగు అప్లై చేస్తున్నారా.. ఇవి గమనించండి..!

Curd Benefits: జుట్టుని అందంగా మార్చుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేటి జీవనశైలి, నీటి మార్పుల కారణంగా చాలా మంది జుట్టు సమస్యలని ఎదుర్కొంటున్నారు. అయితే మార్కెట్‌లో జుట్టు కోసం చాలా ప్రొడాక్టులు అమ్ముతున్నారు కానీ వాటివల్ల దుష్పలితాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం చాలామంది తెలిసినవారు జుట్టుకి పెరుగుని అప్లై చేస్తారు. అయితే పెరుగుని జుట్టుకి ఎంతసేపు అప్లై చేయాలి. ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. తదితర వివరాలు తెలుసుకుందాం.

పెరుగును జుట్టుకి 30 నిమిషాలు అప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దాని ప్రయోజనాలు తక్కువ సమయంలోనే లభిస్తాయి. మీరు దీన్ని ఎక్కువసేపు అప్లై చేసినా ఫలితంలో తేడా ఉండదు. అరగంట తర్వాత మీరు సాధారణ నీటితో జుట్టును కడగవచ్చు. ఈ పేస్ట్‌ని ప్రతివారం జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మెరిసిపోవడంతో పాటు పెరుగుదల కూడా బాగుంటుంది. జుట్టు బాగా పొడిగా ఉన్నవారు ఖచ్చితంగా పెరుగును ప్రయత్నించాలి. ఇది మీ జుట్టుని బాగు చేస్తుంది.

ఇది కాకుండా జుట్టు పెరగడానికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్‌ని వారానికోసారి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యలో కూడా పెరుగు చాలా మేలు చేస్తుంది. మీకు ఈ రకమైన జుట్టు సమస్య ఉంటే మీరు తప్పనిసరిగా ఈ పెరుగుని ప్రయత్నించాలి. తెల్ల జుట్టు సమస్యలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది. అంటే జుట్టు తెల్లగా మారుతున్న వారు కూడా పెరుగుని అప్లై చేసి మంచి ఫలితాలు పొందవచ్చు. 

Tags:    

Similar News