ఇది లేకుంటే కూర వండలేరు.. కానీ ధర మండిపోతుంది..!

Cumin Price: జీలకర్ర లేనిదే భారతీయ మహిళలు కూరలు వండలేరు.

Update: 2022-05-05 12:00 GMT

ఇది లేకుంటే కూర వండలేరు.. కానీ ధర మండిపోతుంది..!

Cumin Price: జీలకర్ర లేనిదే భారతీయ మహిళలు కూరలు వండలేరు. దాదాపు ప్రతి వంటకంలో దీని అవసరం ఉంటుంది. ఆహారానికి రుచి అందంచడంలో ఇది పనిచేస్తుంది.పెట్రోల్, నిమ్మకాయల తర్వాత ఇప్పుడు జీలకర్ర ధర కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జీలకర్ర పంట దెబ్బతినడంతో ధర 30 నుంచి 35 శాతం పెరిగి 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. క్రిసిల్ రీసెర్చ్ నివేదికలో తక్కువ దిగుబడి కారణంగా జీలకర్ర ధర కిలోకు రూ. 165 నుంచి 170 వరకు పెరుగుతుందని పేర్కొంది.

2021-22 పంట సీజన్‌లో (నవంబర్-మే) వివిధ కారణాల వల్ల జీలకర్ర ఉత్పత్తి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీని కారణంగా జీలకర్ర ధరలు 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరగవచ్చు. క్రిసిల్ ప్రకారం 2021-2022 రబీ సీజన్‌లో జీలకర్ర సాగు విస్తీర్ణం ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గి 9.83 లక్షల హెక్టార్లకు చేరుకుంది. జీలకర్ర ఉత్పత్తి చేసే రెండు ప్రధాన రాష్ట్రాలు గుజరాత్‌లో సాగు విస్తీర్ణం 22 శాతం, రాజస్థాన్‌లో 20 శాతం తగ్గింది.

ఆవాలు, మినుము పంటలకు రైతులు మొగ్గు చూపడం వల్లే సాగు విస్తీర్ణం తగ్గుతోందని నివేదిక పేర్కొంది. ఆవాలు, కందిపప్పు ధరలు పెరగడంతో రైతులు వాటి సాగువైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. దీంతో జీలకర్ర సాగు తగ్గిపోయింది. రానున్న రోజుల్లో జీలకర్ర ధరలు బాగా పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News