Health Tips: ఈ వంట నూనెలని వాడటం వల్లే క్యాన్సర్‌..!

Health Tips: భారతదేశంలో చాలా మంది ప్రజలు క్యాన్సర్‌కు గురవుతున్నారు.

Update: 2022-08-06 12:30 GMT

Health Tips: ఈ వంట నూనెలని వాడటం వల్లే క్యాన్సర్‌..!

Health Tips: భారతదేశంలో చాలా మంది ప్రజలు క్యాన్సర్‌కు గురవుతున్నారు. ఇది చాలా ప్రాణాంతక వ్యాధిగా మారుతోంది. ఎందుకంటే దీని లక్షణాలు ప్రారంభ దశలో గుర్తించబడవు. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ఇందులో భాగంగా మీరు ఆహారం వండడానికి వాడే వంటనూనె మంచిదో కాదో తెలుసుకోండి.

నూనెను వాడకుండా రుచికరమైన వంటకాలు చేయలేం. కానీ వంట నూనెను అధికంగా ఉపయోగించడం వల్ల అది ప్రాణాంతకంగా మారుతోంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసిన ఆహారం శరీరం pH స్థాయిని నియంత్రించకుండా చేస్తుంది. దీని కారణంగా బెల్లీఫ్యాట్‌, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆహారంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదకరమని చాలా పరిశోధనలలో తేలింది.

పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్ చాలా వేడిగా మారితే అవి ఆల్డిహైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది క్యాన్సర్ కారక మూలకం. దీని కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. వెంటనే ఈ నూనెల వాడకాన్ని ఆపడం మంచిది. నెయ్యి, తెల్ల వెన్న, ఆలివ్ నూనె వంటి కొన్ని నూనెలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ నూనెలను వేడి చేసినప్పుడు ఆల్డిహైడ్‌లు తక్కువగా విచ్ఛిన్నమవుతాయి. మీరు ఆయిల్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News