Obesity: ఊబకాయం తగ్గించే ఔషధం మీ కిచెన్‌లోనే ఉందిగా..!

Obesity: భారతీయుల వంటగదుల్లో ఔషధ గుణాలు ఉండే చాలా ఆహారాలు ఉంటాయి.

Update: 2022-06-10 10:00 GMT

Obesity: ఊబకాయం తగ్గించే ఔషధం మీ కిచెన్‌లోనే ఉందిగా..!

Obesity: భారతీయుల వంటగదుల్లో ఔషధ గుణాలు ఉండే చాలా ఆహారాలు ఉంటాయి. వీటిలో ఉప్పు, పంచదార, అల్లం, నిమ్మకాయ, మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రయోజనాలని కలిగి ఉంటాయి. వీటన్నింటిని కలిపి హౌస్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇందులో అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక అంశాలు ఉంటాయి.

అల్లం టీ రుచిని పెంచడమే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది. అలాగే స్థూలకాయాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో దోహదం చేస్తుంది. అల్లంలో విటమిన్లు, జింక్, ఐరన్, కాల్షియం మొదలైనవి విరివిగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రజలందరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. ఈ పరిస్థితిలో అల్లం వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అల్లం వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది గ్యాస్ నుంచి కఫం వరకు పనిచేస్తుంది. కడుపు సమస్యలను దూరం చేస్తుంది. అల్లం, ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం స్థూలకాయాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో జీవక్రియని పెంచుతుంది. మీరు బరువు తగ్గాలని కోరుకుంటే ఖచ్చితంగా డైట్‌లో అల్లం ఉండే విధంగా చూసుకోండి.

Tags:    

Similar News