Health Tips: చలికాలంలో మలబద్దకం సమస్య ఇబ్బందిపెడుతుందా..!

Health Tips: చలికాలంలో మలబద్దకం సమస్య ఇబ్బందిపెడుతుందా..!

Update: 2022-11-05 02:22 GMT

Health Tips: చలికాలంలో మలబద్దకం సమస్య ఇబ్బందిపెడుతుందా..!

Health Tips: నేటి జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. పొట్టకు సంబంధించిన ఈ సమస్యలు చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుదలకు శీతాకాలం ఉత్తమంగా ఉంటుంది. అవి మన శరీరంపై దాడి చేస్తే మనకు రకరకాల వ్యాధులు సంభవిస్తాయి. కొంతమందిలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో స్పైసీ, హెవీ ఫుడ్ తినడం కడుపులో సమస్యలను పెంచుతుంది. అందుకే మలబద్దకం తగ్గించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. మీరు ప్రతి సంవత్సరం శీతాకాలంలో మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటే ఈ చిట్కాని పాటించండి. మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకునే ముందు రోజూ 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం. ఇలా చేయడం వల్ల పేగులు శుభ్రపడతాయి. మీ జీవక్రియ రేటు చక్కగా ఉంటుంది.

2. లైట్ వాకింగ్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. దీంతోపాటు ఉదయం కడుపు క్లియర్ అవుతుంది.

3. బొప్పాయి పేగులను శుభ్రంగా ఉంచే పండు. ఇందులో విటమిన్లు, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. కాబట్టి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి.

Tags:    

Similar News