Health: ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం.. ఇది ఈ వ్యాధి కావొచ్చు..!

Health: రక్తం గడ్డకట్టడం అనేది మన జీవితానికి ఒక వరంలాంటిది. లేదంటే చిన దెబ్బ తగిలినా తీవ్ర రక్తస్రావమై మనిషి చనిపోవచ్చు

Update: 2022-07-02 14:30 GMT

Health: ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం.. ఇది ఈ వ్యాధి కావొచ్చు..!

Health: రక్తం గడ్డకట్టడం అనేది మన జీవితానికి ఒక వరంలాంటిది. లేదంటే చిన దెబ్బ తగిలినా తీవ్ర రక్తస్రావమై మనిషి చనిపోవచ్చు. కానీ రక్తం గడ్డ కట్టే గుణాన్ని కలిగి ఉంటుంది. గాయం తర్వాత రక్తస్రావం ఆగిపోతుంది. గడ్డకట్టిన తర్వాత చర్మం తనంతట తానే మరమ్మత్తు ప్రక్రియని ప్రారంభిస్తుంది. అయితే ఈ రక్తం గడ్డకట్టడం నరాలు, సిరల లోపల జరిగితే చాలా ప్రాణాంతకం. సిరలలోపల రక్తం గడ్డకట్టడాన్ని థ్రోంబోఎంబోలిజం అంటారు. ఈ వ్యాసంలో ధమనులు, సిరల్లో రక్తం గడ్డకట్టడం ఎందుకు జరుగుతుంది.. దాని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

గుండె దడ

మీరు క్రమం తప్పకుండా గుండె దడ అనుభవిస్తున్నారా? అయితే అది ఎంబోలిజం లక్షణం కావచ్చు. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనిని భర్తీ చేయడానికి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది నాడీ సమస్యకు దారితీస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఊపిరితిత్తుల ఎంబోలిజం మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు మూర్ఛపోతున్నట్లు అనిపించవచ్చు.

ఛాతి నొప్పి

గుండెపోటు కారణంగా ఒక వ్యక్తి అనుభవించే నొప్పి, ఊపిరితిత్తుల ఎంబోలిజం సమయంలో అదే నొప్పి సంభవిస్తుందని నమ్ముతారు. వ్యత్యాసం ఏంటంటే ఊపిరితిత్తుల ఎంబోలిజం నొప్పి మీరు కత్తిపోటుకు గురైనట్లు ఉంటుంది. మీరు లోతైన శ్వాస తీసుకున్నప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

నిరంతర దగ్గు

దగ్గు చాలా కాలం పాటు కొనసాగితే అది ఊపిరితిత్తుల ఎంబాలిజం లక్షణం కావచ్చు. కాబట్టి తేలిగ్గా తీసుకోకండి.

చర్మం రంగులో మార్పు

చేతులు, కాళ్లపై ఎరుపు లేదా ముదురు రంగు పాచెస్ లేదా గుర్తులు ఉంటే సిరల లోపల రక్తం గడ్డకట్టడం అయి ఉంటుంది.

Tags:    

Similar News