Urine Colour Change Reason: మూత్రం ఈ రంగులో వస్తోందా.? ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క..
Urine Colour Change Reason: మనకు వచ్చే వ్యాధుల గురించి శరీరం మనల్ని ముందు నుంచే అలర్ట్ చేస్తుంది.
Urine Colour Change Reason: మూత్రం ఈ రంగులో వస్తోందా.? ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క..
Urine Colour Change Reason: మనకు వచ్చే వ్యాధుల గురించి శరీరం మనల్ని ముందు నుంచే అలర్ట్ చేస్తుంది. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా మన ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వాటిలో మూత్రం ఒకటి. మన మూత్రం రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. మూత్రం రంగు ఆధారంగా శరీరంలో యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, ప్రొస్టేట్ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ మూత్రం రంగులో మార్పులు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
* లేత పసుపు రంగు మూత్రం సాధారణంగా ఆరోగ్యకరమైనదే. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే కూడా మూత్రం రంగు లేత పసుపుగా మారవచ్చు. ఇది మధుమేహం లేదా మూత్రపిండ సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు.
* మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే డీహైడ్రేషన్‌కు లక్షణంగా భావించాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
* ఎరుపు లేదా గులాబీ రంగు మూత్రం రావడానికి కొన్ని ఆహార పదార్థాలు (బీట్‌రూట్, బ్లూబెర్రీలు) కారణం కావొచ్చు. అయితే, ఇది మూత్రంలో రక్తం కలిసినట్లు కూడా సూచించవచ్చు, ఇది మూత్రపిండ వ్యాధులు, గాయాలు లేదా క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలి. మీ ఆహారంలో రంగు మార్పులకు కారణమయ్యే పదార్థాలు లేవని ధృవీకరించిన తర్వాత కూడా ఈ సమస్య కొనసాగితే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* గోధుమ లేదా డార్క్ బ్రౌన్ కలర్ మూత్రం కాలేయ వ్యాధులు, జాండీస్, గాల్స్‌టోన్ సమస్యలు, లేదా శరీరంలో విషప్రభావం వల్ల సంభవించవచ్చు. ఇది తీవ్రమైన సమస్యకు సంకేతంగా ఉండే అవకాశం ఉన్నందున వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుపచ్చ లేదా నీలం రంగు మూత్రం చాలా అరుదుగా కనిపించే సమస్య. కొన్ని మందుల ప్రభావం వల్ల లేదా అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవించవచ్చు. ఇది తరచుగా కనిపిస్తే, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
మూత్ర సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతీరోజూ కచ్చితంగా తగినంత నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యూరిన్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఏవైనా ఆహార పదార్థాలు తీసుకుంటున్న సమయంలో మూత్రం రంగులో మార్పు కనిపిస్తుందా అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అలాంటిదేం లేకపోయినా మూత్రం రంగులో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
నోట్: ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి స్వీయ నిర్ణయాలకంటే వైద్యులను సంప్రదించడమే మంచిది.