Chaddannam Health Benefits: చద్దన్నమే ఇమ్యూనిటీ పెంచే ప్రధాన ఆయుధం

Chaddannam Health Benefits: శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉత్సాహంగా ఉండటానికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది.

Update: 2021-05-04 08:01 GMT

చద్దన్నం (ఫైల్ ఫోటో )

Chaddannam Health Benefits: దేశంలో కరాళనృత్యం చేస్తోన్న కరోనాను ఎదుర్కోవాలంటే శరీరంలో ఇమ్యూనిటీ ని పెంచుకోవడం తప్ప ఏ మందు అదుపుచేయలేవని అనేక అంశాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి ఇమ్యూనిటీ ఎందులో వుంటుందోనని అందరూ టార్చిలైట్ వేసుకుని ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పుల చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు వైద్యులు. పల్లెటూరి బ్రేక్ ఫాస్ట్ చద్దన్నంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆచద్దన్నం కరోనాను ఎదుర్కోవడంలో ఎలా సహాయం చేస్తుందో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

ఒకప్పుడు పల్లెల్లో బ్రేక్ ఫాస్ట్ అంటే చద్దన్నమే. న్యూట్రీషియన్స్ పరంగా చద్ధికూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది అని చెబుతున్నారు. అంత ఘనంగా చద్దన్నంలో ఏముందంటే..శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉత్సాహంగా ఉండటానికి ఈ చద్దన్నం తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే..వడదెబ్బనుంచి రక్షిస్తుంది..జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని హరిస్తుంది. మతిమరుపు, ఆల్జీమర్స్‌, బుద్ధిమాంద్యం.. వంటి సమస్యల్ని నిలువరిస్తుందని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు.

పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్‌ 21 శాతం ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్లలో బి12-విటమిన్‌ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్థకమైన ఆహారమనీ రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ రక్తహీనత లేకుండా... దంతాలూ ఎముకలూ దృఢంగా ఉంటాయనీ చెబుతున్నారు. అల్సర్లూ పేగు సమస్యలు ఉన్నవాళ్లకి పరమౌషధంలా పనిచేస్తుందట

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో వేసుకొని దానిని ఉదయాన్నే తినేసి పొలం పనులకి వెళ్లిపోయేవారు. ఇప్పటికీ పల్లెల్లో చాలామందికి ఈ అలవాటు ఉంది. రాత్రి మిగిలిన అన్నం ఓ కుండలో వేసి నీళ్లు, కాస్త గంజి పోసి దబ్బ లేదా నిమ్మ ఆకు వేసి మూడురోజులు పులియనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసీ పులియబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగ పోసుకుని ఉల్లిపాయో మిరపకాయో నంచుకుని తినేవారు. మరికొందరు రాత్రి అన్నంలో నీళ్లు పోసి ఉదయాన్నే పులిసిన మజ్జిక పోసుకుని తింటుంటారు. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో చద్దన్నం, పులిసిన మజ్జిగలో బ్యాక్టీరియా కరోనాతో యుద్ధం చేస్తుందని చెబుతున్నారు.

చద్దన్నం గొప్పతనం భారతదేశమంతటా వ్యాపించింది. అమెరికన్‌ న్యూట్రిషన్‌ అసోసియేషన్‌ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ మన దగ్గరా ప్రాచుర్యంలోకి రావడమే కాదు...ఏకంగా స్టార్‌ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్‌లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ జోడించి చద్దన్నాన్ని వడ్డిస్తున్నారు. ఏదేమైనా కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చుచేయాల్సిన అవసరం కూడా లేదు..నిత్యం చద్దన్నం తింటే కొంతలో కొంత పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు న్యూట్రిషియన్లు. సో ఇంకెందుకు ఆలస్యం కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు ఇక నుండి చద్దెన్నం తినడం మొదలెట్టేద్దాం.

Tags:    

Similar News