Dark Circles Problems: కళ్లకింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యా.. ఇలా సులువుగా తొలగించుకోండి..!

Dark Circles Problems: ఎండాకాలం వచ్చిందంటే కళ్ల కింద నల్లటి వలయాల సమస్య మరింత పెరుగుతుంది. వీటివల్ల పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లలేకపోతారు.

Update: 2024-03-26 15:00 GMT

Dark Circles Problems: కళ్లకింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యా.. ఇలా సులువుగా తొలగించుకోండి..!

Dark Circles Problems: ఎండాకాలం వచ్చిందంటే కళ్ల కింద నల్లటి వలయాల సమస్య మరింత పెరుగుతుంది. వీటివల్ల పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లలేకపోతారు. ఇవి ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వీటిని తొలగించుకోవడానికి చాలామంది మార్కెట్‌లో లభించే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడుతారు. కానీ వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా సైడ్‌ ఎఫెక్స్‌ ఎదురవుతాయి. అందుకే సహజసిద్దంగా వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

నిమ్మరసం

నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి వలయాల పై నిమ్మరసం రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బంగాళాదుంప రసం

బంగాళదుంపలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. దీని కోసం బంగాళాదుంపను రుబ్బి దాని రసాన్ని తీయాలి. డార్క్ సర్కిల్స్ మీద 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత ముఖాన్ని కడగాలి.

పెరుగు, శనగపిండి

శెనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి, పెరుగు వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి తర్వాత కడిగేయాలి. నల్లటి వలయాలకు ఇది చాలా మేలు చేస్తుంది.

అలోవెరా జెల్

అలోవెరా జెల్ నల్లటి వలయాలను తగ్గించడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజా కలబంద జెల్‌ను తీసి బ్లాక్ సర్కిల్‌ పై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే కళ్లకింద నల్లటి వలయాలు త్వరగా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News