Sugar Patients: షుగర్‌ బాధితులు గుడ్డు తినవచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?

Diabetic Patients Eat Egg Or Not: మధుమేహం (డయాబెటిస్) అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం నియంత్రణలో ఉంచుకోవాల్సిన సమస్య.

Update: 2025-07-03 06:41 GMT

Sugar Patients: షుగర్‌ బాధితులు గుడ్డు తినవచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?

Diabetic Patients Eat Egg Or Not: మధుమేహం (డయాబెటిస్) అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం నియంత్రణలో ఉంచుకోవాల్సిన సమస్య. షుగర్ వచ్చినవారు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేనిని తినాలో, దేనిని తినకూడదో స్పష్టంగా తెలుసుకుని, ఆహార నియమాలు పాటించాలి. ఈ క్రమంలో షుగర్ ఉన్నవారు గుడ్డు తినొచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలు, సలహాలు ఇలా ఉన్నాయి.

మధుమేహాన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్‌గా పరిగణిస్తారు. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. వయసు పెరుగుతుండగా, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కోడిగుడ్డు లో ఉన్న పోషక విలువలు:

గుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇక గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపదు. దీనివల్ల షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు.

నిపుణుల సూచనల ప్రకారం… మధుమేహ బాధితులు వారంలో రెండు నుంచి మూడు గుడ్లు మితంగా తీసుకోవచ్చు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రెండు మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు గుడ్లు తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

మధుమేహ నియంత్రణ కోసం అనుసరించవలసిన జాగ్రత్తలు:

అధికంగా నీళ్లు తాగడం

ఒత్తిడికి లోనుకాకపోవడం

తగిన నిద్ర పోవడం

తాజా కాయగూరలు, పండ్లు, సిరిధాన్యాలతో తయారైన ఆహారం తీసుకోవడం

కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం

రోజూ వ్యాయామం చేయడం

రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవడం

మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో ఆహారం, వ్యాయామం, మానసిక స్థితి ముఖ్యపాత్ర పోషిస్తాయి. గుడ్లను కూడా మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారపు మార్పులు చేసుకోవడం ఉత్తమం.

గమనిక: ఇది అవగాహన కల్పించేందుకు అందించిన సమాచారం మాత్రమే. కానీ దీనిని hmtv న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. మీ వైద్యులను సంప్రదించి గుడ్డు తినాలా? వద్దా అనేది తెలుసుకోండి.

Tags:    

Similar News