Bird Flu Virus: మానవుల్లో విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Bird Flu Virus: బర్డ్‌ ఫ్లూ వల్ల పక్షులు పెద్ద ఎత్తున చనిపోతాయి.

Update: 2023-07-19 11:41 GMT

Bird Flu Virus: మానవుల్లో విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!( Representative image)

Bird Flu Virus: బర్డ్‌ ఫ్లూ వల్ల పక్షులు పెద్ద ఎత్తున చనిపోతాయి. చాలాసార్లు పౌల్ట్రీఫాంలలో కోళ్లు గుంపులు గుంపులుగా చనిపోవడాన్ని గమనించే ఉంటారు. ఇది బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వల్లే జరుగుతుంది. తాజాగా ఇది మనుషులకి కూడా సోకుతుందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. బర్డ్ ఫ్లూ వైరస్‌ అంటే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజాలో కొన్ని మార్పులు జరుగుతున్నాయని దీనివల్ల మనుషుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరిగిందని తెలిపాయి. ఇటీవల బ్రిటన్‌లో ఇద్దరు మనుషులలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేన్‌ (WHO) తెలిపింది. అందుకే ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వాస్తవానికి ఇప్పటి వరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు చాలా తక్కువ. కానీ ఈ వైరస్ పక్షుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. అయితే మానవుని నుంచి మరో మానవునికి మాత్రం సోకడం లేదు. ఇది ఆనందించాల్సిన విషయం. ఈ పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ మాదిరి ఇది అంటువ్యాధి కాదు. కానీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే బర్డ్ ఫ్లూను నివారించడానికి టీకా కానీ ఔషధం కానీ ఏది లేదు. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రజలు పక్షుల దగ్గరికి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు పడిన పక్షి దగ్గరికి వెళ్లవద్దు. పౌల్ట్రీ ఫారమ్‌లలో పనిచేసే వ్యక్తులు బర్డ్ ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

బర్డ్ ఫ్లూ లక్షణాలు

1. దగ్గు

2. తీవ్ర జ్వరం

3. శ్వాసకోస ఇబ్బంది

4. కండరాల నొప్పి

5. వాంతులు అవ్వడం

6. పొత్తి కడుపు నొప్పి

ఈ వ్యక్తులు పరీక్ష చేయించుకోవాలి

ఒక వ్యక్తికి పక్షితో పరిచయం ఏర్పడి ఈ లక్షణాలన్నీ కనిపిస్తే అతడు వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఫ్లూ నిర్ధారణ అయినట్లయితే వ్యాధిని యాంటీవైరల్ మందులతో నియంత్రిస్తారు. దీంతో కోలుకునే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News