Fruits: ఎక్కువ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఇది షుగర్ లెవల్ పెంచుతాయట

Fruits: చిన్నప్పటి నుంచి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఏ పండ్లు ఎవరికి మంచివి కావో చాలా మంది చెప్పరు. కొన్ని పండ్లలో షుగర్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి.

Update: 2025-06-30 03:00 GMT

Fruits: ఎక్కువ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఇది షుగర్ లెవల్ పెంచుతాయట

Fruits: చిన్నప్పటి నుంచి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఏ పండ్లు ఎవరికి మంచివి కావో చాలా మంది చెప్పరు. కొన్ని పండ్లలో షుగర్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తాయి. ఈ పండ్లను సరైన మోతాదులో తీసుకోకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాగా తీపిగా ఉండే పండ్లు వారి గ్లూకోజ్ లెవల్స్‌ను పెంచుతాయి. అలాంటి పండ్లలో మామిడి, ద్రాక్ష, అరటిపండు, దానిమ్మ, సపోటా ఉన్నాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రోజూ ఎక్కువ తీపి పండ్లు తింటూ, శారీరక శ్రమ చేయకపోతే, నెమ్మదిగా బరువు పెరిగి, షుగర్ మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. ఇలా ఎక్కువ కాలం చేస్తే మందుల మోతాదును కూడా పెంచాల్సి రావచ్చు.

ఈ పండ్లు అందరిలో షుగర్ లెవెల్స్‌ను పెంచవని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, వీటిని పరిమితంగా తినడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ పండ్లను తప్పకుండా తగ్గించాలి. మామిడి తీపిగా ఉంటుంది. కానీ, ఇందులో ఫ్రక్టోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజు మామిడిపండులో దాదాపు 30 గ్రాముల సహజ షుగర్ ఉంటుంది. అరటిపండులో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కానీ, పండిన కొద్దీ ఇందులో షుగర్ పెరుగుతుంది. ఒక మీడియం అరటిపండులో దాదాపు 14 గ్రాముల సహజ షుగర్ ఉంటుంది. లీచీ వేసవిలో ఎక్కువగా తినే పండు. అయితే, లీచీలో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. 10-12 లీచీ పండ్లలో దాదాపు 29-30 గ్రాముల సహజ షుగర్ ఉండవచ్చు. దానిమ్మను ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు. కానీ, షుగర్ విషయానికి వస్తే ఒక కప్పు దానిమ్మ గింజల్లో దాదాపు 24 గ్రాముల సహజ షుగర్ ఉంటుంది.

ఏ పండ్లు తినవచ్చు?

కొన్ని పండ్లను షుగర్ లెవెల్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా తినవచ్చు. అవి యాపిల్, నేరేడు పండు, జామకాయ, నారింజ. ఈ పండ్లలో షుగర్ తక్కువగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి మంచివి.

Tags:    

Similar News