Banana Benefits : అరటిపండును ఈ టైంలో తింటే అద్భుతమే..ఆ సమస్యలన్నీ పరార్

Banana Benefits : అతి తక్కువ ధరలో, ఏడాది పొడవునా లభించే అమృతం లాంటి పండు అరటిపండు. కానీ, చాలా మంది దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు.

Update: 2026-01-20 15:30 GMT

Banana Benefits : అరటిపండును ఈ టైంలో తింటే అద్భుతమే..ఆ సమస్యలన్నీ పరార్

Banana Benefits : అతి తక్కువ ధరలో, ఏడాది పొడవునా లభించే అమృతం లాంటి పండు అరటిపండు. కానీ, చాలా మంది దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు. అరటిపండులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలంటే దానిని సరైన సమయంలోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే తింటే ఎనర్జీ బూస్టర్!

నిద్ర లేవగానే నీరసంగా అనిపిస్తుందా? అయితే ఒక అరటిపండు తినండి. ఉదయం పూట అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే అరటిపండు తింటే జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. అయితే ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా చిన్న అల్పాహారం తర్వాత దీనిని తీసుకోవడం ఇంకా మంచిది.

వ్యాయామానికి ముందు తింటే తిరుగులేదు

మీరు జిమ్‌కు వెళ్లేవారైనా లేదా ఇంట్లోనే వ్యాయామం చేసేవారైనా సరే.. వర్కవుట్‌కు 30 నిమిషాల ముందు 1 లేదా 2 అరటిపండ్లు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులోని కార్బోహైడ్రేట్లు మీకు వ్యాయామానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా, వ్యాయామం చేసేటప్పుడు కండరాలు పట్టేయకుండా ఇందులోని పొటాషియం కాపాడుతుంది. కండరాల బలానికి ఇది గొప్ప ఆహారం.

భోజనం తర్వాత జీర్ణక్రియ స్పీడప్

చాలా మంది భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినాలని కోరుకుంటారు. దానికి బదులుగా ఒక అరటిపండు తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అరటిపండులో ఉండే పీచు పదార్థం మనం తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

ఈ సమయంలో అస్సలు తినకండి

సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ తినే బదులు అరటిపండు తినడం ఎంతో ఉత్తమం. ఇది అనవసరపు ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఆపుతుంది. అయితే, రాత్రి 7 గంటల తర్వాత అరటిపండు తినడం అంత మంచిది కాదు. రాత్రి పూట తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట దీనికి దూరంగా ఉండాలి. సరైన సమయంలో అరటిపండును తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags:    

Similar News