Walking Benefits: నడక వల్ల చాలా ప్రయోజనాలు.. వివిధ ఆరోగ్య సమస్యలు దూరం..!

Walking Benefits: మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకని మించినది మరొకటి లేదు.

Update: 2022-06-03 12:30 GMT

Walking Benefits: నడక వల్ల చాలా ప్రయోజనాలు.. వివిధ ఆరోగ్య సమస్యలు దూరం..!

Walking Benefits: మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకని మించినది మరొకటి లేదు. నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. డాక్టర్ల నుంచి ఫిట్‌నెస్ నిపుణుల వరకు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సిఫార్సు చేస్తారు. నడక అనేది మొత్తం శరీర కదలికను కలిగి ఉండే వ్యాయామం. అన్ని అవయవాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదు. ఏ వయసు వారైనా నడవవచ్చు. నడక బరువును అదుపులో ఉంచుతుంది. అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. గుండె ఆరోగ్యంగా ఉంటుంది

నడక గుండెకు చాలా మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. నడక వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నడక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

2. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి

రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. నడక ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం బాగా జరుగుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి.

3. జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది

నడక ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ నడవడం ద్వారా బరువు తగ్గుతారు. నడక ద్వారా శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తయారవుతాయి. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.

4. మనస్సు దృఢంగా మారుతుంది

నడక మనస్సును పదును చేస్తుంది. నడిచేటప్పుడు మెదడులో మార్పులు ఉంటాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తుంది. నడక మెదడు, నాడీ వ్యవస్థలో ఉండే హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలి.

Tags:    

Similar News