Sea Buckthorn Benefits: సీ బక్ థార్న్.. పండు చిన్నదే.. పోషకాలు మాత్రం చాలా ఎక్కువ..!

Sea Buckthorn Benefits: సీ బక్ థార్న్.. ఈ పేరు వింటే ఇదేదో సముద్ర ప్రాంతంలో దొరికే పండు అని అనుకుంటున్నారా? అసలు కాదు.

Update: 2025-06-13 10:43 GMT

Sea Buckthorn Benefits: సీ బక్ థార్న్.. పండు చిన్నదే.. పోషకాలు మాత్రం చాలా ఎక్కువ..!

Sea Buckthorn Benefits: సీ బక్ థార్న్.. ఈ పేరు వింటే ఇదేదో సముద్ర ప్రాంతంలో దొరికే పండు అని అనుకుంటున్నారా? అసలు కాదు. ఇది మంచు ప్రాంతంలో పెరిగే మొక్క. బెర్రీలా కనిపించే ఈ పండు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ దీనిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం మీరు ఇప్పటి నుంచే తినడం మొదలుపెడతారు.

పోషకాలు చాలా ఎక్కువ

సీ బక్ థార్న్.. ఇదొక ముళ్ల పొదకు అలాగే బెర్రీ ఫ్యామిలీకి చెందినది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. దీనిని పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ గింజలనుంచి వచ్చే నూనె వృద్యాప్య చాయలు రాకుండా చేస్తుంది. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్, కొన్ని ఖనిజాలు ఉన్నాయి. దీనికి చర్మాన్ని షైన్ తెచ్చే శక్తి ఉంది.

తరచుగా అనారోగ్యానికి గురైయ్యే వాళ్లు ఈ పండును తినడం వల్ల త్వరగా కోలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఈ పండ్లు తింటే కొలిస్ట్రాల్ తగ్గి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం

సీ బక్ థార్న్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుండి బయటపడేస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు వీటిని తినడం దాని నుండి ఉపశమనం పొందుతారు.

మహిళలకు మరింత ప్రయోజనకరం

ఈ పండుని తినడం వల్ల మహిళల్లోని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. పీరియడ్స్, మోనొపాజ్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇదొక రిలీఫ్. పీసీవోడీ నుంచి బయటపడేస్తుంది. శరీరానికి బలాన్ని ఇచ్చి, అలసటను తగ్గిస్తుంది.

ఈ పండ్లు పసుపు–నారింజ రంగులో ఉంటాయి. ఉత్తర , మద్య యూరోప్, పశ్చిమ ఆసియా, చైనా, లడఖ్, హిమాలయ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. లడక్ లో లెహ్ బెర్రీస్, ఉత్తరాఖండ్‌లో అమేష్, హిమాచల్ ప్రదేశ్‌లో చర్మా, మున్సియారి లోయలో లేఖ్ అని పిలుస్తారు. రాతన కాలంలో యూరోపియన్లు గుర్రాల జుట్టుకు ఈ బెర్రీలను చుట్టేవారు.

Tags:    

Similar News