Hibiscus Flower Drink: బీపీని కంట్రోల్ చేసే మందారపూల టీ

Benefits of Hibiscus Tea: మందార టీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

Update: 2021-06-27 03:07 GMT

Benefits of Hibiscus 

Benefits of Hibiscus Tea: మారుతున్న జీవన ప్రమాణాలు, ఉరుకులు పరుగుల జీవితాలతో పోషకాహారం, సరిపడా నిద్ర లేమితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో బిపి ఒకటి. భారతదేశంలో ప్రతి 4 మంది పెద్దలలో ఒకరికి రక్తపోటు ఉంది. జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు , మందుల సహాయంతో అదుపులో పెట్టుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ , కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో మందారల పూల టీ ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. మరి అదేంటో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

- భారత దేశంలో మందార పువ్వుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ మందారంతో తేనీరుని కూడా తయారు చేస్తారు. ఈ హెర్బల్ మందార, టీ మరియు పానీయం కొద్దిగా పుల్లని రుచి కలిగి ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

- న్యూట్రిషనల్ జర్నల్ పరిశోధన ప్రకారం, మందార పూల రసం రక్తపోటును తగ్గించగలదు. మందార టీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇది రక్త నాళాలను సులభంగా నిర్బంధిస్తుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.

మరి మందార పూల టీని ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

మందారం టీ తయారీకి కావలసిన పదార్థాలు: ఎండ పెట్టినమందారం పూల పొడి,నిమ్మ కాయ, చక్కెర లేదా తేనె, దాల్చినచెక్క; పుదీనా ఆకులు.నీరు.

తయారీ విధానం...

ముందుగా చల్లటి నీటిలో మందారం పొడి రేకులను వేసి రెండు గంటలు నానబెట్టండి. అనంతరం ఈ నీటి మట్టి కుండలో కానీ గాజు పాత్రలో కానీ పోసి (లోహపు పాత్రలో టీ రంగు మారుతుంది) స్టౌ మీద ఉంచి మరిగించండి. అలా మరరించిన పానీయాన్ని వడకట్టి.. చక్కర లేదా తేనే వేసుకుని నిమ్మరసం వేసుకుని తాగ వచ్చు లేదా .. ఇష్టమైన వారు దాల్చిన చెక్క లేదా పుదీనా ఆకులూ వేసుకుని తాగవచ్చు. చల్లని టీ ని ఇష్టపడే వారు ఈ మందిరం హెర్బల్ టీ లో ఐస్ ముక్కలను కూడా వేసుకుని తాజాగా పుదీనా వేసుకుని తాగవచ్చు.. లేదంటే ప్రస్తుతం ఈ మందారం టీ పాకెట్స్ వస్తున్నాయి.. వాటితో కూడా టీ తయారు చేసుకోవచ్చు.

మందారం టీ వల్ల ఉపయోగాలు...

రక్త నాళాల గోడలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది;

చెడు కొలెస్ట్రాల్ నిల్వను కరిగిస్తుంది.

తీవ్రమైన ఒత్తిడి ని మందారం టీ నివారిస్తుంది.

దీర్ఘకాలిక అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది.

మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. చర్మం రంగుని కాంతివంతం చేస్తుంది.

సో ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజూ మందార పూల టీని సేవించి బిపి కంట్రో ల్లో పెట్టుకుందాం.

Tags:    

Similar News