Bellyfat: ఈ చెడ్డ అలవాట్ల వల్లే బెల్లీఫ్యాట్‌ సమస్య.. అవేంటంటే..?

Bellyfat: ఈ చెడ్డ అలవాట్ల వల్లే బెల్లీఫ్యాట్‌ సమస్య.. అవేంటంటే..?

Update: 2022-07-12 14:30 GMT

Bellyfat: ఈ చెడ్డ అలవాట్ల వల్లే బెల్లీఫ్యాట్‌ సమస్య.. అవేంటంటే..?

Bellyfat: నేటి కాలంలో బెల్లీఫ్యాట్‌ అనేది ఒక పెద్ద సమస్య. దీని కారణంగా చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిని కరిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా బెల్లీఫ్యాట్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు చేసే తప్పుల వల్లే బెల్లీఫ్యాట్‌ పెరుగుతుంది. వాటిని మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ అలవాట్ల గురించి ఓ లుక్కేద్దాం.

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే మీ దినచర్యలో సమతుల్య ఆహారం తినాలి. వ్యాయామాలను కచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక పరిశోధన ప్రకారం ఊబకాయానికి సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడమే కాదు నిద్రలేమి కూడా పెద్ద కారణమవుతుంది. మీరు సమయానికి నిద్రపోకపోతే ఊబకాయం పెరుగుతుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువవుతుంది. మంచి ఆరోగ్యం కోసం రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా ముఖ్యం.

అయితే రోజులో ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోవాలని అర్థం కాదు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారు లేదా తక్కువ నిద్రపోయే వ్యక్తులకి ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రి 10 గంటలలోపు నిద్రపోతే ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. మొత్తంమీద మీరు మంచి నిద్రతో పాటు రాత్రిపూట త్వరగా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి. తద్వారా మీ ఊబకాయం పెరగదు. అలాగే బెల్లీఫ్యాట్ సమస్య ఉండదు.

Tags:    

Similar News