Lifestyle: ఒంటరిగా జీవిస్తే ఈ ప్రాణాంతక సమస్యలు తప్పవా?

Update: 2025-01-20 16:28 GMT

ఒంటరిగా జీవిస్తే ఈ ప్రాణాంతక సమస్యలు తప్పవా?

Solo life effects on health: ఒంటరిగా జీవిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. హ్యాపీగా ఉండొచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే ఒంటరిగా జీవించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలంగా ఒంటరి జీవితాన్ని గడిపే వారిలో మానసిక సమస్యలు మొదలు, శారీరక సమస్యలు వెంటాడుతాయని అంటున్నారు. ఇంతకీ ఒంటరిగా జీవించడం వల్ల శరీరంలో జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. CDCలో ప్రచురించిన ఒన నివేదిక ప్రకారం ఒంటరితనం కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒంటిరితనం వల్ల కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు.

* ఒంటరిగా జీవించే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లకు సమానంగా ఒంటరిగా జీవించే వారిలో కూడా ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా నివసించే వారికి దీని ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తరచుగా నిద్ర సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు.

* ఒంటరితనం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నారు. సమాజం నుంచి ఒంటరిగా జీవించే వారిలో అధిక రక్తపోటు, ఊబకాయంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

* ఒంటరితనం సామాజిక ఆందోళనకు కారణమవుతుంది. ఇలాంటి వారు బయటకు వెళ్లడం, ఇతరులను కలవడానికి ఆందోళన చెందుతుంటారు. ఇతరులతో మాట్లాడేందుకు వెనుకాడతారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటారోనని భయపడుతుంటారు.

* ఒంటరిగా జీవించే వారిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

* ఒంటరిగా జీవించే వారిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇలాంటి వారు పదే పదే అనారోగ్యానికి గురవుతారు. పరిశోధనల్లో తేలిన వివరాలు ప్రకారం ఒంటరితనం కారణంగా శరీరంలో యాంటీ బాడీలు సరిగ్గా ఏర్పడవు. ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

Tags:    

Similar News