Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరం.. ఈ విధంగా తొలగించుకోండి..!

Bad Breath: ఈరోజుల్లో నోటి దుర్వాసన చాలామందిని ఇబ్బందిపెడుతోంది. మన చుట్టు ఉండే వ్యక్తులు దీంతో చాలా ఇబ్బందిపడుతారు.

Update: 2023-05-22 14:30 GMT

Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరం.. ఈ విధంగా తొలగించుకోండి..!

Bad Breath: ఈరోజుల్లో నోటి దుర్వాసన చాలామందిని ఇబ్బందిపెడుతోంది. మన చుట్టు ఉండే వ్యక్తులు దీంతో చాలా ఇబ్బందిపడుతారు. కానీ చెప్పడానికి సంకోచిస్తారు. కొన్నిసార్లు సమావేశాలు, ఫంక్షన్లకి వెళ్లినప్పుడు స్నేహితులు కానీ దగ్గరి వ్యక్తులు కానీ ఈ సమస్య గురించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటో బాక్టీరియా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దంత సమస్యలు, చిగుళ్లకు సంబంధించిన సమస్య ఉంటే అది దుర్వాసనకి దారితీస్తుంది. కొందరిలో పైయోరియా వల్ల కూడా దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టే కొన్ని చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

పటిక

నోటి దుర్వాసన తొలగించుకోవడానికి పటిక సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో పటికను వేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో స్టోర్‌ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి. దీంతో దుర్వాసన తొలగిపోతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా అనేక ఆహార పదార్థాల తయారీలో వాడుతారు. కానీ ఇది నోటి దుర్వాసన తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలపాలి. దీంతో రోజుకు కనీసం 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. దీని ఫలితాన్ని మీరే స్వయంగా తెలుసుకుంటారు.

లవంగం

లవంగాన్ని మన వంటగదిలో మసాలాగా ఉపయోగిస్తారు. ఇది చాలా ఘాటైన వాసనని కలిగి ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. శ్వాసను తాజాగా ఉంచుతుంది. ఉదయం బ్రష్ చేసిన తర్వాత లవంగాలతో తయారు చేసిన టీని తాగాలి. దీని కోసం ఒక పాత్రలో నీరు, లవంగాల పొడిని కలిపి సుమారు 15 నిమిషాలు మరిగించి వడకట్టి తీసుకోవాలి. ఇది నోటి దుర్వాసనని తొలగిస్తుంది.

Tags:    

Similar News