Health: మీ కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Chordiac issues: గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో వస్తున్న మార్పులు, శారీరక శ్రమ తగ్గడం... ఇలా ఎన్నో కారణాలతో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలోనూ కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా అప్పటికే గుండెపోటు వచ్చి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబంలో గుండెపోటు వచ్చిన హిస్టరీ ఉంటే, కుటుంబంలోని ఇతర సభ్యుల్లో కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కుటుంబంలో గుండెపోటు వచ్చిన వారు ఉంటే ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అధిక ఒత్తిడి కారణంగా రక్తపోటు సమస్య వస్తుంది. ఇది గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక మద్యపానం అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
* జంక్‌ఫుడ్‌కు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే నూనె ఎక్కువగా ఉండే ఫుడ్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ను తీసుకున్నా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
* ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చునే అలవాటు ఉన్న వారు వెంటనే అలర్ట్ అవ్వాలి. కచ్చితంగా ఒకే చోట గంటల తరబడి కదలకుండా కూర్చోకుండా నడకను అలవాటు చేసుకోవాలి.
* స్మోకింగ్ అలవాటు ఉన్న వారు కూడా ఆ అలవాటును వెంటనే మానుకోవాలి. మరీ ముఖ్యంగా కుటుంబంలో హార్ట్ ఎటాక్ వచ్చిన వారు స్మోకింగ్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. నికొటిన్ రక్తాన్ని చిక్కగా చేస్తుంది. ఇది గుండె బలహీనంగా మారడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
నోట్: ఈ వివరాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.