Health: చిన్న వయసులో ఎముకల నొప్పి ఎందుకు.? మీరు చేసే ఈ తప్పులే కారణం

Health: చిన్న వయసులో ఎముకల నొప్పి ఎందుకు.? మీరు చేసే ఈ తప్పులే కారణం
x
Highlights

Health: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఎముకలు బలహీనంగా మారుతున్నాయి.

Health: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. పాతికేళ్ల వయసు వారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. సరిగ్గా మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. అయితే ఎముకలు బలహీనంగా మారడానికి మనం చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కారణాలు ఏంటి.? ఎముకలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా.

* ఎముకలు త్వరగా బలహీనంగా మారడానికి ప్రధాన కారనాల్లో సరైన పోషకాహారం లేకపోవడం ఒక కారణం. ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం, విటమిన్ D చాలా అవసరం. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు తినకపోతే ఎముకలు బలహీనపడతాయి.

* విటమిన్‌ డీ లోపం కూడా ఎముకల సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి విటమిన్ D అందాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. రోజుకు కనీసం 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపాలి.

* ఇక అధికంగా ప్రోటీన్‌ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయని మీకు తెలుసా.? ప్రోటీన్‌ శరీరానికి అవసరమే కానీ ఎక్కువైతే మాత్రం శరీరంలో క్యాల్షియం పరిమాణం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* మద్యం, కార్బొనేటెడ్ పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల ఎముకల బలహీనత వస్తుంది. ఇవి శరీరంలోని క్యాల్షియం స్థాయిని ప్రభావితం చేస్తాయి.

* శరీరానికి సరైన వ్యాయామం లేకపోతే ఎముకలు బలహీనపడతాయి. నడక, జాగింగ్, యోగా లాంటి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి.?

* ప్రతీరోజూ కచ్చితంగా సూర్యరశ్మిలో కనీసం 15 నిమిషాలు గడపాలి.

* తీసుకునే ఆమారంలో పాల ఉత్పత్తులు, గుడ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.

* ఆల్కహాల్‌, సోడా, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

* రోజూ వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. కనీసం 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలి.

* సమస్య మరీ ఎక్కువైతే వైద్యుల సూచన మేరకు విటమిన్‌ డీ, క్యాల్షియం ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories