ముప్పై ఏళ్ల తర్వాత వీటికి దూరంగా ఉండండి.. లేదంటే ముసలితనం ముంచుకొస్తుంది..!

ముప్పై ఏళ్ల తర్వాత వీటికి దూరంగా ఉండండి.. లేదంటే ముసలితనం ముంచుకొస్తుంది..!

Update: 2022-10-28 14:30 GMT

ముప్పై ఏళ్ల తర్వాత వీటికి దూరంగా ఉండండి.. లేదంటే ముసలితనం ముంచుకొస్తుంది..!

Health Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది. 30 ఏళ్లు దాటితే తిండి, తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ముసలితనం తొందరగా వస్తుంది. ఈ వయసులో శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అలసట, కీళ్ల నొప్పులు, శరీరం నొప్పులు అనేక సమస్యలు దరిచేరుతాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహారాలని మానేయాలి. వాటి గురించి తెలుసుకుందాం.

బంగాళదుంప చిప్స్

బంగాళదుంప చిప్స్ రుచి అన్ని వయసుల వారికి నచ్చుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు చిప్స్ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ ఆహారం ఎంత పాపులర్ అయినా ఆరోగ్యానికి మాత్రం హానికరం. మీరు 30 ఏళ్లు దాటితే చిప్స్‌ని నివారించండి. ఎందుకంటే చిప్స్ తయారీలో సింథటిక్ పదార్థాలు కలుపుతారు. ఇది రుచిని పెంచుతుంది. అలాగే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.

రుచిగా ఉండే పెరుగు

పెరుగు తింటే శరీరానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత రుచికరమైన పెరుగుకి దూరంగా ఉండండి. ఎందుకంటే అందులో చక్కెర అధికంగా ఉంటుంది. దీని కారణంగా మధుమేహం, ఊబకాయం సంభవిస్తుంది.

పాప్‌కార్న్

మనం మల్టీప్లెక్స్‌లో లేదా సాయంత్రం ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు పాప్‌కార్న్ తినడానికి చాలా ఇష్టపడతాము. ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. కానీ సాధారణంగా ఇది మార్కెట్‌లో చాలా ఉప్పు, ఆయిల్‌ వేసి తయారుచేస్తారు. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందుకే మంచిది కాదు.

Tags:    

Similar News