Asthma: ఆస్తమా రోగులు ఈ ఆహారాలు తినడం చాలా ప్రమాదకరం.. అవేంటంటే..?

Asthma: ఆస్తమా రోగులు ఈ ఆహారాలు తినడం చాలా ప్రమాదకరం.. అవేంటంటే..?

Update: 2022-02-22 09:00 GMT

Asthma: ఆస్తమా రోగులు ఈ ఆహారాలు తినడం చాలా ప్రమాదకరం.. అవేంటంటే..?

Asthma: ఆస్తమా లేదా ఉబ్బసం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో రోగి శ్వాసనాళాలు వాపుకి గురవుతాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అప్పుడప్పుడు ఊపిరి ఆడదు. దీంతో గురక మొదలవుతుంది. వ్యాధి ముదరకుండా ఉండాలంటే మందులు వాడుతూ కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అమెరికన్ లంగ్ అసోసియేషన్ (ALA) ఆస్తమా రోగులు తినకూడని కొన్ని ఆహారాలు, పానీయాలను గుర్తించింది. ఇవి తీసుకుంటే వారి లక్షణాలు మరింత పెరుగుతాయి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

1. సల్ఫైట్ ఉండే పదార్థాలు

సల్ఫైట్ అనేది ఒక రకమైన ప్రిజర్వేటివ్. ఇది ఆల్కహాల్, ఊరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాటానికి కలుపుతారు. ఆస్తమా పేషెంట్లు వీటిని తినకూడదు. సల్ఫైట్‌లను ఎక్కువగా తీసుకుంటే వారి ఆస్తమా లక్షణాలు తీవ్రం కావడమే కాకుండా డేంజర్‌ జోన్‌లోకి వెళుతారు.

2. కడుపులో గ్యాస్ తయారు చేసే ఆహారాలు

ఉబ్బసం రోగులు ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే వీరికి కడుపులో గ్యాస్ సమస్య ఉంటుంది. అది డయాఫ్రాగమ్‌పై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో ఛాతీలో బిగుతుగా, పట్టేసినట్లుగా ఉంటుంది. ఆస్తమా లక్షణాలు పెరిగిపోతాయి. అందువల్ల ఆస్తమా రోగులు బీన్స్, క్యాబేజీ, కార్బోనేటేడ్ పానీయాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, వేయించిన వాటిని తీసుకోవడం మానుకోవాలి.

3. ఫాస్ట్ ఫుడ్ మానుకోండి

2013 అధ్యయనంలో వారానికి 3 సార్ల కంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినే పిల్లలు, యుక్తవయస్కులలో తీవ్రమైన ఆస్తమా లక్షణాలు బయటపడ్డాయి. కాబట్టి మసాలా ఆహారాలు, వేయించిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అప్పుడే ఆస్తమా కంట్రోల్‌లో ఉంటుంది.

Tags:    

Similar News