Alert: అలర్ట్‌.. చలికాలంలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది..!

Alert: చలికాలం కొంతమందికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Update: 2022-11-24 10:32 GMT

Alert: అలర్ట్‌.. చలికాలంలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది..!

Alert: చలికాలం కొంతమందికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో వీరు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆస్తమా వ్యాధిలో శ్వాసకోశ గొట్టాలలో వాపు ఏర్పడుతుంది. దీని కారణంగా శ్వాస మార్గం చిన్నదిగా లేదా ఇరుకుగా మారుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇది కాకుండా దగ్గు సమస్య ఉంటుంది.

ఈ సమయంలో ఛాతీలో గురక, ఛాతీలో బిగుతు వంటి సమస్యలు ఏర్పడుతాయి. గణాంకాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆస్తమా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన గాలి పీల్చినప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. చలికాలంలో ఇది ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది.

ఈ వ్యాధి వృద్ధులు, పిల్లలలో సాధారణం. ఆస్తమా రోగులు దుమ్ము, బురద లేదా బహిరంగ వాతావరణాన్ని నివారించాలి. పొగ త్రాగకూడదు. అంతే కాకుండా చల్లని ప్రదేశాలు, చల్లని నీరు తాగడం మానుకోవాలి. ఆస్తమాతో బాధపడేవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. దుమ్ము, ధూళి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఇది ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా శ్వాస వ్యాయామాన్ని అనుసరించాలి.

Tags:    

Similar News