Quit Smoking Tips: సిగరెట్‌ మానలేకపోతున్నారా.. ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!

Quit Smoking Tips: ఈ రోజుల్లో సిగరెట్‌ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. యవత దీని బారిన అధికంగా పడుతున్నారు.

Update: 2024-03-03 15:00 GMT

Quit Smoking Tips: సిగరెట్‌ మానలేకపోతున్నారా.. ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!

Quit Smoking Tips: ఈ రోజుల్లో సిగరెట్‌ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. యవత దీని బారిన అధికంగా పడుతున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాటు తర్వాత ప్రాణాలు తీసే వరకు వెళుతంది. రోజుకు ఒక్కదానితో మొదలై ప్యాకెట్‌ సిగరెట్లు తాగే వరకు వెళుతుంది. పొగాకు, నికోటిన్ ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు సిగరెట్ మానేయాలనుకుంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలు సాధారణంగా సిగరెట్ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతారు. అయితే ధూమపానం గుండె జబ్బులకు కూడా కారణమవుతంది. ఒక వ్యక్తి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగితే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ధూమపానం చేయని వారి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్యకరమైన జీవితం కోసం ధూమపానం మానేయడం ముఖ్యం. అయితే అది అంత సులభం కాదు. మీ మెదడు నికోటిన్‌కు బానిసగా మారుతుంది. కొన్నిసార్లు ధూమపానం మానేయడం తలనొప్పికి కారణమవుతుంది. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ సాయం తీసుకోవచ్చు. అంతే కాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ధూమపానం మానేయవచ్చు.

వీటికి దూరంగా ఉండండి

సిగరెట్, ఆష్‌ట్రే, లైటర్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల సిగరెట్‌ తాగాలనే ఆలోచన మనసులో రాదు. మీ బ్యాగ్, అల్మారా లేదా ఏదైనా డ్రాయర్ నుంచి ఇలాంటి వస్తువులను తీసేయండి.

ఆహారపు అలవాట్లను మార్చుకోండి

సిగరెట్‌ తాగాలనిపించినప్పుడు ఏదైనా తినడం అలవాటు చేసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన స్నాక్స్ మీతో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు వీలైనంత ఎక్కువగా హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. చిన్ని చిన్న స్వీట్లను బ్యాగులో పెట్టుకోండి.

కొంత సమయం కేటాయించండి

ధూమపానం వంటి వ్యసనాన్ని వదిలిపెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఇందుకోసం ఓపికగా ఉండండి. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇది మీకు ఎంతో సాయం చేస్తుంది.

Tags:    

Similar News