Vitamin D Supplements: విటమిన్‌ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Vitamin D Supplements: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలను అందించాలి. ఇందులో డి విటమిన్‌ అత్యంత ముఖ్యమైనది.

Update: 2024-03-23 15:00 GMT

Vitamin D Supplements: విటమిన్‌ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Vitamin D Supplements: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలను అందించాలి. ఇందులో డి విటమిన్‌ అత్యంత ముఖ్యమైనది. నేటి బిజీ లైఫ్‌లో విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనత, అలసట, కండరాల నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమ ఎంపిక. విటమిన్ డి ఉత్తమ మూలం సూర్యకాంతి. కానీ చాలా మంది కొన్ని కారణాల వల్ల విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాల్సి పరిస్థితులు వస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం.

వైద్యుడిని సంప్రదించాలి

ఎముకలలో నొప్పి, అలసట, బలహీనత, తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు, డిప్రెషన్‌, గాయాలు నెమ్మదిగా మానడం, కండరాల నొప్పి వంటివి విటమిన్ డి లోపం ప్రత్యేక లక్షణాలు. మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. విటమిన్ డి స్థాయిని చెక్ చేసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు విటమిన్‌ డి సప్లిమెంట్స్‌ వాడాలి.

సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడవద్దు

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఆహారంలో విటమిన్ డి సహజ వనరులను సప్లిమెంట్లతో పాటు చేర్చండి. చేపలు, పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చసొన, మాంసం విటమిన్ డి ఉత్తమ వనరులు. ఉదయం సూర్యకాంతిలో 15నుంచి 20 నిమిషాలు గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇతర విటమిన్లపై కూడా శ్రద్ధపెట్టాలి

విటమిన్ డి కొవ్వులో కరిగేది. విటమిన్ డి మెరుగ్గా పనిచేయడానికి మెగ్నీషియంతో పాటు విటమిన్ ఎ, కెలను తగిన మొత్తంలో చేర్చడం ప్రయోజనకరం. ఈ మూడు పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

అధిక మోతాదు తీసుకోవద్దు

ఎక్కువ కాలం పాటు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల వాంతులు, డిప్రెషన్, కడుపు నొప్పి, అధిక రక్తపోటు, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Tags:    

Similar News