Beauty Tips: ముఖంపై ముడతల బాధ ఎక్కువైందా.. ఈ యాంటీ ఏజింగ్ చిట్కాతో చెక్‌పెట్టండి..!

Beauty Tips: ఈ రోజుల్లో గాలి కాలుష్యం వల్ల చాలామంది చర్మం నిర్జీవంగా తయారవుతుంది.

Update: 2023-03-15 15:30 GMT

Beauty Tips: ముఖంపై ముడతల బాధ ఎక్కువైందా.. ఈ యాంటీ ఏజింగ్ చిట్కాతో చెక్‌పెట్టండి..!

Beauty Tips: ఈ రోజుల్లో గాలి కాలుష్యం వల్ల చాలామంది చర్మం నిర్జీవంగా తయారవుతుంది. దీంతో చిన్నవయసులోనే ముఖంపై ముడతలు సంభవిస్తున్నాయి. నేటి రోజుల్లో ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనిని నివారించడానికి మార్కెట్‌లో లభించే చాలా బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతున్నారు కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు. అందుకే ఇంట్లో లభించే వస్తువులని ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. అలాంటి ఒక చిట్కా గురించి ఈరోజు తెలుసుకుందాం.

గుడ్డులో ప్రొటీన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. కాబట్టి గుడ్డు ఆరోగ్యానికి, చర్మానికి ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. గుడ్డు చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. ఇది ముఖంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. గుడ్డులోని తెల్లసొన, పెరుగు, చక్కెర సహాయంతో ఒక అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారుచేయవచ్చు. ఈ మూడు వస్తువులు యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి. కాబట్టి ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల ముఖంలో ముడతలు తగ్గుతాయి. అంతేకాదు మీరు చాలా కాలం పాటు యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు

ఒక గుడ్డు తెల్లసొన,

కొద్దిగా పెరుగు,

ఒక టీస్పూన్ చక్కెర

ఈ ఫేస్ మాస్క్ తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక గుడ్డు పగలగొట్టి, తెల్లని భాగాన్ని పోయాలి. తరువాత అందులో ఒక చెంచా పెరుగు, కొద్దిగా చక్కెర కలపాలి. తర్వాత ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత ముఖానికి బాగా అప్లై చేయాలి. సుమారు 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చేయాలి.

Tags:    

Similar News