Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతుందా.. ఈ గింజలతో సమస్యకి పరిష్కారం..!

Hair Care Tips: గుమ్మడి గింజలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి.

Update: 2022-11-07 03:34 GMT

Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతుందా.. ఈ గింజలతో సమస్యకి పరిష్కారం..!

Hair Care Tips: గుమ్మడి గింజలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మెరుపును తిరిగి తెస్తుంది. అలాగే పొడి, నిర్జీవమైన జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా గుమ్మడి గింజలను ఉపయోగించాలి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్ని జుట్టు పెరుగుదలకి సహాయపడుతాయి.

జుట్టు పెరుగుదల

మీ జుట్టు వేగంగా రాలుతున్నట్లయితే గుమ్మడికాయ గింజలను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు వేగంగా పెరగడానికి, మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. మీరు వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీంతో పాటు వీటిలో ఉండే మూలకాలు జుట్టును లోపలి నుంచి కాపాడుతాయి.

చుండ్రును తగ్గిస్తాయి

జుట్టుకు చుండ్రు అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఒక్కసారి చుండ్రు వస్తే అది అంత తేలికగా తగ్గదు. జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు జుట్టు రాలడాన్ని ఆపడానికి, చుండ్రును వదిలించుకోవడానికి గుమ్మడి గింజలను తప్పనిసరిగా ఉపయోగించాలి. కొద్ది రోజుల్లోనే మీరు తేడాని గమనిస్తారు.

బలహీన జుట్టుకి మేలు

బలహీనమైన జుట్టు, చిక్కులు పడే జుట్టుకి గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడుతాయి. ప్రతి రోజు వీటిని తీసుకుంటే జుట్టు అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. మార్కెట్‌లో దొరికే కెమికల్‌ ప్రొడాక్ట్స్‌ కంటే గుమ్మడి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

Tags:    

Similar News