Spicy Food Side Effects: స్పైసీ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా.. ఈ అనర్థాలను భరించాల్సిందే..!

Spicy Food Side Effects: ఈ రోజుల్లో యువత స్పైసీ ఫుడ్‌కి అడిక్ట్‌ అవుతున్నారు.

Update: 2024-03-25 16:00 GMT

Spicy Food Side Effects: స్పైసీ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా.. ఈ అనర్థాలను భరించాల్సిందే..!

Spicy Food Side Effects: ఈ రోజుల్లో యువత స్పైసీ ఫుడ్‌కి అడిక్ట్‌ అవుతున్నారు. ఇంట్లో వండి న ఆహారాన్ని వదిలి మరీ బయటికి వెళ్లి రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలలో తింటున్నారు. వారం ఏడు రోజులు స్పైసీ ఫుడ్‌ తినేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి తినేటప్పుడు ఇది ఆనందాన్ని కలిగిస్తుంది కావొచ్చు కానీ తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. స్పైసీ ఫుడ్‌ తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు

ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపు సమస్యలు ఎదురవుతాయి. మితిమీరిన కారంగా ఉండే ఆహారం ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి కడుపు సమస్యలను కలిగిస్తుంది.

పేగులలో పుండ్లు

మెరుగైన జీర్ణక్రియ కోసం మంచి పేగు ఆరోగ్యాన్ని కలిగి ఉండటం అవసరం. మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తుల పేగులలో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వాటిలో వేసే సుగంధ ద్రవ్యాలు పేగు గోడలకు అంటుకుని ఇబ్బందిని కలిగిస్తాయి.

అధిక రక్తపోటు

స్పైసీ ఫుడ్‌కు రుచిని జోడించడానికి ఎక్కువ ఉప్పును ఉపయోగిస్తారు. ఇందులో అధిక మొత్తంలో నూనె కూడా వాడుతారు. ఇది సిరల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తర్వాత అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అధిక బీపీ వల్ల గుండె జబ్బులు ఎదురవుతాయి.

పైల్స్

స్పైసీ ఫుడ్‌ను క్రమం తప్పకుండా తినే వ్యక్తులు దీర్ఘకాలంలో పైల్స్‌తో బాధపడుతారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పేగు కదలిక సమయంలో లేదా పాయువు నుంచి రక్తస్రావం సమయంలో మంటను ఎదుర్కొంటారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే యాసిడ్, స్పైసి ఎలిమెంట్స్ ఆందోళన, ఉత్సాహం, అధిక ఒత్తిడి వంటి సమస్యలను కలిగిస్తాయి.

Tags:    

Similar News