Health Tips: లంచ్‌లో పెరుగు తింటున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

Health Tips: చలికాలం ముగింపు దశలో ఉంది ఎండాకాలం ప్రారంభ దశలో ఉంది. ఇక వాతావారణం రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది.

Update: 2024-03-01 07:30 GMT

Health Tips: లంచ్‌లో పెరుగు తింటున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

Health Tips: చలికాలం ముగింపు దశలో ఉంది ఎండాకాలం ప్రారంభ దశలో ఉంది. ఇక వాతావారణం రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. అయితే మహాశివరాత్రి తర్వాత ఎండలు ముదురుతాయి. వీటిని తట్టుకోవాలంటే డైట్‌లో చల్లటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అయితే చాలామందికి వేసవి వచ్చిందంటే గుర్తుకువచ్చేది పెరుగు. లేదా పెరుగుతో చేసిన ఆహార పదార్థాలు. ఇక కొంతమంది మధ్యాహ్నం పెరుగులేకుంటే అసలు అన్నమే ముట్టరు. లంచ్‌ సమయంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పెరుగు జీర్ణక్రియకు మంచిది

లంచ్‌లో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటిని మంచి బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. దీంతో పాటు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శక్తిని అందిస్తాయి

పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మధ్యాహ్నం పెరుగు తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సాయపడుతుంది.

శరీరానికి చల్లదనం

పెరుగు మన శరీరంలోని వేడిని తొలగించడంలో సాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో అధిక చెమటను నివారిస్తుంది. దంత సమస్యల నుంచి రక్షిస్తుంది.

బరువు నియంత్రణ

పెరుగును నిరంతరం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని కారణంగా ప్రజలు అతిగా తినకుండా ఉంటారు. పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇది భోజనం తర్వాత ఆకలిని తగ్గించడంలో సాయపడుతుంది.

చర్మానికి మేలు

పెరుగులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయడంలో సాయపడుతుంది. చర్మంపై మొటిమలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

పోషక విలువలు పుష్కలం

పెరుగులో క్యాల్షియం, విటమిన్ డి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలకు మేలు చేస్తాయి. అందువల్ల మధ్యాహ్న భోజనంలో పెరుగు కచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి.

Tags:    

Similar News