Electric Cooker Rice: ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో రైస్‌ వండుతున్నారా.. ముందుగానే వీటికి రెడీ ఉండండి..!

Electric Cooker Rice: ఈ రోజుల్లో అన్నం వండుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఇందుకోసం ఎలక్ట్రిక్‌ రైస్ కుక్కర్లు వచ్చేశాయి.

Update: 2024-03-22 14:30 GMT

Electric Cooker Rice: ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో రైస్‌ వండుతున్నారా.. ముందుగానే వీటికి రెడీ ఉండండి..!

Electric Cooker Rice: ఈ రోజుల్లో అన్నం వండుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఇందుకోసం ఎలక్ట్రిక్‌ రైస్ కుక్కర్లు వచ్చేశాయి. ఈ కుక్కర్‌ ఎన్ని బియ్యం వేశామో దానికి డబులు నీరు పోసి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. వెంటనే అన్నం అయిపోయి స్విచ్‌ కూడా ఆఫ్‌ అయిపోతుం ది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇందులోని అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా.. ఎలక్ట్రిక్‌ కుక్కర్‌లో వండిన అన్నం దీర్ఘకాలంగా తినడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు. పోషకాలు మాట పక్కన పెడితే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం తప్పదంటున్నారు నిపుణులు. అల్యూమినియం పాత్రలను వినియోగించడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాసిరకం రైస్ కుక్కర్లను వాడితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన ఆహారం తీసుకుంటే చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల శరీరానికి పోషకాలు లభించవు. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దంటున్నారు డాక్టర్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగిస్తే ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మట్టి పాత్రల్లో వండుకొని తినడం అన్ని విధాల శ్రేయస్కరం.

Tags:    

Similar News