Antibiotics: సీజనల్ వ్యాధులకు యాంటీబయోటిక్‌లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే.. ప్రమాదంలో పడినట్లే?
Antibiotics: వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. తరచూ జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతుంటారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం అనేవి తరచూ వచ్చేవే కదా అని చాలామంది వాటికి సంబంధించిన మందులతో పాటు యాంటీబయోటిక్‌లు కూడా తెగ వాడేస్తుంటారు.
Antibiotics: సీజనల్ వ్యాధులకు యాంటీబయోటిక్‌లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే.. ప్రమాదంలో పడినట్లే?
Antibiotics: వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. తరచూ జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతుంటారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం అనేవి తరచూ వచ్చేవే కదా అని చాలామంది వాటికి సంబంధించిన మందులతో పాటు యాంటీబయోటిక్‌లు కూడా తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా యాంటీబయోటిక్‌లు వేసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని డాక్టర్లు అంటున్నారు.
వర్షాకాలంలో అంటు వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. స్కూల్‌కి వెళ్లిన పిల్లలకు ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధులు సోకుతుంటాయి. అదేవిధంగా పెద్దవాళ్లలో కూడా ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల తన మనవళ్లు, మనవరాళ్ల వల్ల తరచూ సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలోనే యాంటీబయోటిక్స్ ఎక్కువగా వీరికి ఇచ్చేస్తూ ఉంటారు.
ఎలాంటి సమయంలో యాంటీబయోటిక్స్ వాడాలి?
సీజనల్‌గా వచ్చే అనారోగ్య సమస్యలు అంటే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం.. వీటికి చాలామంది యాంటీబయోటిక్స్ వాడతారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నాలుగైదు రోజులు వీటికి సంబంధించిన మెడిసిన్ వాడిన తర్వాతే యాంటీబయోటిక్స్ వాడాలి. వీటి స్థానంలో సిరప్‌లు, చిన్నపిల్లల మందులను మాత్రమే వాడాలి.
కొంతమంది మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయోటిక్‌లు కొని వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం సేఫ్ కాదు. డాక్టర్ సలహా మేరకే వీటిని వాడాలి.
అదేవిధంగా ఎన్నోరోజులు యాంటీ బయోటిక్స్ వాడమని డాక్టర్లు చెప్పారో అన్ని రోజులు మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ రోజులు వాడకూడదు. అలా అని మధ్యలో కూడా వదిలేయకూడదు.
చాలామంది తక్కువ జ్వరం ఉన్నప్పుడే తొందరగా తగ్గిపోవాలనే తపనతో యాంటీ బయోటిక్స్ వాడతారు. అయితే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీల లోపు ఉంటేనే యాంటీబయోటిక్స్ వాడటం మంచిది.
ఒకవేళ డాక్టర్లే యాంటీ బయోటిక్స్ ఇస్తే.. అతను పేషెంట్ హిస్టరీని బాగా పరిశీలించాలి. ఎంపైరిక్ యాంటీబయోటిక్ థెరపీని ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కేవలం తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే పరిమితం చేసింది.
ఎక్కువ వాడితే ఏం జరుగుతుంది?
ప్రతి చిన్న దానికీ యాంటీ బయోటిక్స్ వాడితే వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్ద్యం పెరుగుతోంది. దీంతో వ్యాధులకు ట్రీట్మెంట్ చేయడం తర్వాత కష్టంగా మారుతుంది.
యాంటీ బయోటిక్ డోస్ శరీరంలోఎక్కువైతే చర్మ, మృదు కణాల ఇన్ఫెక్షన్లు, ఇతరుల ద్వారా సోకిన న్యుమోనియాకు ఐదు రోజులు, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు న్యుమోనియా వస్తే ఎనిమిది రోజుల యాంటీ బయోటిక్స్ చికిత్స అందించాలని గతంలోనే ఐసీఎంఆర్(భారత వైద్య పరిశోధన మండలి) రూల్స్ ని జారీ చేసింది.
యాంటీబయోటిక్స్ కన్నా ఇవి బెస్ట్
సీజనల్ వ్యాధుల నుంచి చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్లను కాపాడేందుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ముందే వేయడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఆపగలుగుతాం. పిల్లల విషయానికొస్తే ఫ్లూ వ్యాక్సిన్‌ను ఇవ్వాలి. అదేవిధంగా పెద్ద వాళ్లకు ఫ్లూ, నూమోకోకల్ అనే రెండు వ్యాక్సిన్లను ఇప్పించాలి.
పిల్లలు, పెద్దవాళ్ల విషయంలో మెడికల్ పరంగా ఎలా నిర్ణయం తీసుకోవాలన్నా డాక్టర్ల సలహా ప్రకారమే తీసుకోవాలి. సొంతవైద్యం ఎప్పటికీ మంచిది కాదు. అందుకే ఇందులో ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్‌ని సప్రందించి, ట్రీట్మెంట్ తీసుకోవాలి.