Hair Care Tips: గుడ్డుతో చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించండి.. ఏ విధంగా అంటే..?

Hair Care Tips: గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుడ్డు ప్రోటీన్‌కి మంచి మూలం.

Update: 2022-11-29 14:19 GMT

Hair Care Tips: గుడ్డుతో చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించండి.. ఏ విధంగా అంటే..?

Hair Care Tips: గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుడ్డు ప్రోటీన్‌కి మంచి మూలం. గుడ్లు తినడం వల్ల ప్రొటీన్ లోపాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు శీతాకాలంలో ఇది జుట్టు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్డు జుట్టును మెరిసేలా, దృఢంగా చేస్తుంది. గుడ్డును హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు.. గుడ్డును జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

గుడ్డు, కలబంద

జుట్టుకి గుడ్డుతో పాటు కలబందను కలిపి అప్లై చేయవచ్చు. ఇందుకోసం 2 గుడ్లు తీసుకుని దానికి 2 స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టు, తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా కనిపిస్తుంది. చుండ్రు సమస్య నుంచి కూడా బయటపడతారు.

గుడ్డు, నిమ్మకాయ

గుడ్డు, నిమ్మకాయ ప్యాక్‌ జుట్టుకి చాలా మంచిది. 2 గుడ్లు తీసుకుని అందులోని పసుపు భాగాన్ని తీసుకుని దానికి నిమ్మరసం, గోరింట కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

గుడ్డు, ఉసిరి పొడి

గుడ్లతో పాటు ఉసిరి పొడి జుట్టుకు మేలు చేస్తుంది. గుడ్డులో ఉసిరి పొడి మిక్స్ చేసి అప్లై చేయాలి. ఇది జుట్టుకు పోషణను అందించడంతో పాటు చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. వారానికి 2 సార్లు చేస్తే జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది.

Tags:    

Similar News