Health Tips: తిన్న తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: ఈ రోజుల్లో తప్పుడు జీవనశైలి కారణంగా చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతున్నారు.

Update: 2022-11-24 14:12 GMT

Health Tips: తిన్న తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: ఈ రోజుల్లో తప్పుడు జీవనశైలి కారణంగా చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. ఎక్కువ మంది ఆహారం తిన్న తర్వాత ఒకే చోట కూర్చుంటారు. తిన్న వెంటనే పడుకోవడం, కూర్చోవడం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది కాకుండా అనేక ఇతర వ్యాధులు వస్తాయి. ఆహారం తిన్న తర్వాత కొద్దిసేపు నడవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

అనేక అధ్యయనాల ప్రకారం శారీరక శ్రమ ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత వాకింగ్‌కు వెళితే బరువు తగ్గుతారు. దీంతో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. నిజానికి ఆహారం తీసుకున్న తర్వాత నడిస్తే శరీరం చురుకుగా మారుతుంది. దీని వల్ల శరీరానికి సరిపోయే పోషకాలు అందుతాయి. ఆహారాన్ని జీర్ణం చేసే పని చిన్న ప్రేగుల ద్వారా జరుగుతుంది. పరిశోధనల ప్రకారం తిన్న తర్వాత నడిచినప్పుడు కడుపు నుంచి ఆహారం చిన్న ప్రేగులకు చేరుతుంది. దీని వల్ల అపానవాయువు, గ్యాస్, యాసిడ్, ఇతర కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

పరిశోధన ప్రకారం తిన్న తర్వాత ఖచ్చితంగా నడవాలి. దీని వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. తిన్న తర్వాత 30 నిమిషాలు నడవండి. సమయం ఉంటే 20 నుంచి 40 నిమిషాలు నడవవచ్చు. దీనివల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు, స్ట్రోక్, చెడు కొలెస్ట్రాల్ నుంచి రక్షించుకోవచ్చు. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

Tags:    

Similar News