Health Tips: ఈ విత్తనాలు తింటే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Health Tips: నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామంతో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

Update: 2022-08-10 02:30 GMT

Health Tips: ఈ విత్తనాలు తింటే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Health Tips: నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామంతో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అందులో భాగంగా ఈ రోజు అవిసెగింజల గురించి తెలుసుకుందాం. వీటినే ఫ్లాక్స్ సీడ్స్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇవి చిన్నగా కనిపించవచ్చు కానీ వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అవిసె గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అవిసె గింజలు ఫైబర్‌కి గొప్ప మూలం. వీటి సహాయంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపు చేయవచ్చు. అవిసె గింజలలో విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాలలో ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. తద్వారా స్త్రీ హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అవిసె గింజలు క్రమం తప్పకుండా తినే వ్యక్తులు గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు.

అవిసె గింజల సహాయంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచవచ్చు. మధుమేహంతో బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి మనలను రక్షిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు అవిసె గింజలను తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇది కడుపుకు ఉపశమనం కలిగిస్తుంది.

Tags:    

Similar News