Women Health: మహిళలకి అలర్ట్‌.. ఈ క్యాన్సర్‌ సైలెంట్‌గా వ్యాపిస్తోంది జాగ్రత్త..!

Women Health: ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

Update: 2022-11-05 15:09 GMT

Women Health: మహిళలకి అలర్ట్‌.. ఈ క్యాన్సర్‌ సైలెంట్‌గా వ్యాపిస్తోంది జాగ్రత్త..!

Women Health: ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఇది మహిళల్లో సంభవించే అత్యంత సాధారణ క్యాన్సర్ రకం. కానీ చాలామంది మహిళలకి దీనిగురించి తెలియదు. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, అవగాహన లోపం వారి మరణానికి దారితీస్తున్నాయి. WHO ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 685,000 మంది మహిళలు మరణించారు. 2.3 మిలియన్ల మంది మహిళలు చికిత్స పొందుతున్నారు.

ఈ రకమైన క్యాన్సర్‌లో లక్షణాలు ఉండవు. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనిని మెటాస్టాసైజ్ అని పిలుస్తారు. మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ అధునాతన దశలో కనుగొన్నారు. ఈ దశలో చికిత్స ఎంపికలు చాలా తక్కువ అంతేకాదు చాలా కష్టం కూడా. 40 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా బ్రెస్ట్ చెకప్ చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైరిస్క్ కేసుల్లో వైద్యుల సలహా మేరకు 25 ఏళ్ల వయస్సు నుంచి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి.

ఎక్స్-రే మామోగ్రఫీ, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, MRI, CT, PIT స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల సారూప్య పరీక్షల ద్వారా రొమ్ములో ఏ రకమైన వ్యాధినైనా గుర్తించవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ ఈ పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఛాతీలో ఏదైనా గడ్డ, చనుమొనలలో మార్పు, వాపు, ఆకారంలో మార్పు లక్షణాలుగా చెప్పవచ్చు. 40 ఏళ్ల తర్వాత క్లినిక్ బ్రెస్ట్ టెస్ట్ అవసరం. రొమ్ము క్యాన్సర్ చికిత్స దశ, దాని రకం, వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం చికిత్స పద్ధతులు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ వంటివి ఉన్నాయి.

Tags:    

Similar News