Weight Loss: ఈ మసాల దినుసు బరువు తగ్గించడంలో సూపర్..!

Weight Loss: ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.

Update: 2022-04-29 16:15 GMT

Weight Loss: ఈ మసాల దినుసు బరువు తగ్గించడంలో సూపర్..!

Weight Loss: ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ ఆధునిక జీవితంలో మీరు సకాలంలో పెరుగుతున్న బరువును నియంత్రించకపోతే సమస్య వేగంగా పెరుగుతుంది. అయితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం కొంతమంది జిమ్‌లో వర్కవుట్స్‌ చేయగా మరికొందరు నేరుగా డాక్టర్‌ వద్దకు వెళ్తారు. ఇవి కాకుండా బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఆయుర్వేదంలో చెప్పారు. వాటి గురించి తెలుసుకుందాం.

వాము బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వాము ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడానికి ఉపయోగపడతాయి. వాములో భేదిమందు గుణాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను బలంగా చేస్తుంది. శరీరంలో జీర్ణశక్తి పటిష్టంగా ఉన్నప్పుడు బరువు నియంత్రించుకోవడం సులభం అవుతుంది.

1. మెంతులు, కలోంజి, వాము

మెంతి గింజలు, కలోంజి, వాముని పొడిగా వేయించి పౌడర్ చేసి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు 1 టీస్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

2. శరీర కొవ్వును తగ్గించడానికి, తేనె బాగా పనిచేస్తుంది. 25 గ్రాముల కలోంజి గింజలని 250 ml నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి 1 టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా కనీసం మూడు నెలలపాటు కొనసాగిస్తే త్వరగా బరువు తగ్గుతారు.

3. బరువు తగ్గడానికి సోంపు, కలోంజి గింజలను వాడాలి

దీని కోసం 1 టీస్పూన్ కలోంజి సీడ్స్, 1 టీస్పూన్ సోంపు తీసుకోవాలి. ఈ రెండింటినీ 4 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. రంగు మారినప్పుడు వాటిని ఫిల్టర్ చేసి తాగాలి. 

Tags:    

Similar News