సినీ హీరో గోపిచంద్‌కు ప్రమాదం

Update: 2019-02-18 07:48 GMT

సినీ హీరో గోపిచంద్‌‌కి ప్రమాదం సంభవించింది. రాజస్థాన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న గోపిచంద్ ఫైట్ సీన్‌లో ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చిత్ర బృందం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించింది.

గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ వద్ద మాండవలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇవాళ అక్కడ చిత్రీకరణ ముగించుకుంటున్న నేపథ్యంలో హీరో గోపిచంద్‌పై బైక్ చేజింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవటంతో స్వల్ప గాయాలయ్యాయి. గోపిచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని గాయాలకు ట్రీట్‌‌మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. 

Similar News