ఈరోజు (మే-17-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-17 01:10 GMT
Andhra Pradesh and Telangana updates from HMTVlive

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

#Andhra pradesh news, #telangana news, #live updates


Live Updates
2020-05-17 16:47 GMT

♦ తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చిడుమూరు గ్రామంలో విషాదం. తమ ప్రేమకు పెద్దల నుంచి వచ్చిన అభ్యంతరం పై మనస్తాపం. దానితో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం.

♦ ప్రియురాలు సున్నం సుజాత(18) మృతి, ప్రియుడు అప్పారావు పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు

2020-05-17 16:44 GMT

♦ కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితులలో ఆలయాలన్నీ మూసివేశారు.

♦ తిరుమల శ్రీవారి ఆలయం కూడా భక్తలకు దూరంగా ఉండిపోయింది.

♦ లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

♦ ఈ నేపధ్యంలో ఆలయం క్యూలైన్ల లో భౌతికదూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

♦ అన్ని పరిస్థితులు చక్కబడి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాకా నిబంధనల ప్రకారం ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించే అవకాశం ఉంది.





2020-05-17 16:07 GMT

♦ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు గ్రామంలో మృతి చెందిన రాజబాబు

♦ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో విశేష సేవలందించిన రాజబాబు

-మరిన్ని వివరాలు 



2020-05-17 16:07 GMT

♦ ఈ రోజు 42 కేసులు నమోదు అయ్యాయి.

♦ ఇందులో 37 కేసులు GHMC పరిధిలోనివి.

♦ తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1551 కి చేరింది.

♦ రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 34 మంది చనిపోయారు.

2020-05-17 14:29 GMT

దేశంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త లాక్‌డౌన్‌లో గైడ్‌లైన్స్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఆ వివరాలివీ...

• జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు , పాఠశాలలు, కళాశాలలు, హోటల్స్‌, రెస్టరెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, ఆడిటోరియమస్స్‌, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం అన్ని రకాల సభలకు అనుమతి లేదు.

• కంటైన్మెంట్‌ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని జోన్లలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, సొంత వాహనాల ప్రయాణం. అయితే దీనికి ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.

• కంటైన్మెంట్‌ జోన్లలో నిత్యావసర, అత్యవసర వస్తువులకు అనుమతి. 

-మరిన్ని వివరాలు 



 



2020-05-17 13:54 GMT

♦ మరో 14 రోజులు లాక్ డౌన్ కొనసాగిస్తూ హోమ్ శాఖ ఉత్తరులు

♦ ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగింపు

♦ కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం

♦ మరి కాసేపట్లో మార్గదర్శకాలు విడుదల

2020-05-17 08:55 GMT

కరోనా వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సొంత నివసాలకి వెళ్ళాలి అనుకున్న వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.

-మరిన్ని వివరాలు

2020-05-17 08:32 GMT

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారంతా తెలంగాణకు వచ్చేందుకు ప్రభుత్వం వారికి పాసులు జారీ చేసి స్వరాష్ట్రానికి రప్పించుకుంటుంది.

-మరిన్ని వివరాలు

2020-05-17 06:42 GMT

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తెలుసుకున్నారు.

-మరిన్ని వివరాలు

2020-05-17 06:40 GMT

ఏపీలో కరోనా కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరో 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,230 కి చేరింది.

-మరిన్ని వివరాలు

Tags:    

Similar News