ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌..

Worlds Longest Car: ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా ఓ కారు గిన్నీస్ బుక్ రికార్డులకెక్కింది.

Update: 2022-03-12 09:53 GMT

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌..

Worlds Longest Car: ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా ఓ కారు గిన్నీస్ బుక్ రికార్డులకెక్కింది. 100 అడుగుల పొడవైన ఈ అమెరికన్ డ్రీమర్ కారు తన రికార్డును తనే చెరిపేసుకుంది. 1986లో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జాయ్ ఓహ్‌ర్బెర్గ్ ఈ కారును తయారు చేశారు. అప్పట్లో దీన్ని 60 అడుగుల పొడవుతో 26 చక్రాలతో రెండు వీ8 ఇంజన్లతో రూపొందించారు. అయితే దీన్ని ఇప్పుడు కొన్ని మార్పులతో మరింత పొడవుగా సిద్ధం చేశారు.

60 అడుగుల పొడవును 100 అడుగులకు పెంచారు. దీన్నికి ముందు, వెనుక ఇంజన్లను అమర్చడంతో రెండు వైపుల నుంచి నడిపే వీలుంటుంది. ఈ కారు పొడవులో ఆరు హోండా సిటీ సెడాన్‌ కార్లను నిలపవచ్చు. అంత పొడవుంటుందన్నమాట. ఈ కారులోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అంతేకాకుండా ఈ కారుపై హెలీప్యాడ్‌ నిలిపే అవకాశం కూడా ఉంటుంది. 


Tags:    

Similar News