WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ తొలిదశలో ఉంది

WHO: 111దేశాలకు డెల్టా వేరియంట్ వ్యాపించింది క‌రోనా నిరంతరం మార్పు చెందుతోంది మరిన్ని డేంజర్ వేరియంట్లు ఉద్భవిస్తున్నాయి

Update: 2021-07-15 12:22 GMT

WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ తొలిదశలో ఉంది

World Health Organization: డెల్టా వేరియంట్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో WHO చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ తొలిదశలో ఉన్నట్లు టెడ్రోస్ పేర్కొకొన్నారు. కరోనా వైరస్ నిరంతరం మారుతుందన్న టెడ్రోస్ మరింత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయన్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ 111దేశాల్లో నమోదైనట్లు WHO చీఫ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.

Tags:    

Similar News