ఒమిక్రాన్ వేరియంట్‌పై WHO షాకింగ్ కామెంట్స్.. కోవిడ్ టీకాలు..

World Health Organization: ఒమిక్రాన్ వేరియంట్ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2021-12-15 14:30 GMT

ఒమిక్రాన్ వేరియంట్‌పై WHO షాకింగ్ కామెంట్స్.. కోవిడ్ టీకాలు..

World Health Organization: ఒమిక్రాన్ వేరియంట్ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒమిక్రాన్‌పై టీకాలు తక్కువ ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడింది. ఇదే సమయంలో రీ ఇన్‌ఫెక్షన్ కలిగేలా ఒమిక్రాన్ ఉందని పేర్కొంది. వ్యాక్సిన్లు, రోగనిరోధక శక్తి ఎంత వరకూ కాపాడతాయన్న దానిపై విశ్లేషణకు మరింత డేటా అవసరం అని WHO స్పష్టం చేసింది.

మరోవైపు ఇప్పటి వరకూ వ్యాపించిన వేరియంట్లలో ఒమిక్రాన్ డేంజర్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ త్వరలోనే మరిన్ని దేశాలకు వ్యాపించనుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు వైరస్ కట్టడికి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు ఇది స్వల్ప వ్యాధి మాత్రమేనని నిర్ధారణకు రావద్దని WHO హెచ్చరించింది. అలా అనుకుంటే మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్‌నె ఎదుర్కోవడంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాల్లో తక్కువ సామర్ధ్యం ఉన్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఫైజర్ రూపొందించిన యాంటీవైరల్ డ్రగ్ మాత్రం ఒమిక్రాన్‌పై సమర్ధంగా పనిచేస్తుందని ఫైనల్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. దీనితోపాటు మెర్క్‌ సంస్థ రూపొందించిన మరో ఔషధాన్ని కొవిడ్‌ చికిత్స కోసం అనుమతిచ్చే అంశంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News